మెగాబ్రదర్ నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, పలు షోలకు జడ్జిగా వ్యవహరించి మెగా బ్రదర్ నాగబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.కెరీర్ మొదట్లో నటుడిగా పలు సినిమాల్లో నటించిన నాగబాబు ఎందుకో హీరోగా సక్సెస్ కాలేకపోయారు.

 Mega Brother Naga Babu Assets Details, Naga Babu,mega Brother Naga Babu, Remuner-TeluguStop.com

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమాతో నాగబాబు నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.అంజనా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు.
అయితే అటు హీరోగాను ఇటు నిర్మాతగానూ నాగబాబు సక్సెస్ కాలేకపోయారు.నాగబాబు చిరంజీవితో రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మించారు.

అయితే ఈ సినిమాల్లో ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా మాత్రమే సక్సెస్ అయ్యాయి.ఆరెంజ్ సినిమాకు భారీ నష్టాలు రావడంతో ఆచితూచి నాగబాబు సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇంట్లోనే స్టార్ హీరోలు ఉన్నప్పటికీ నిర్మాతగా నాగబాబు మాత్రం సక్సెస్ కాలేకపోవడం గమనార్హం.నా పేరు సూర్య సినిమాకు కూడా నాగబాబు నిర్మాతగా వ్యవహరించినా ఆ సినిమాకు లాభాలు వచ్చే విధంగా నాగబాబు జాగ్రత్త పడ్డారు.

ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ షో నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.జబర్దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్ కు నాగబాబు 5 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.

అదిరింది షోకు మాత్రం జబర్దస్త్ కు రెట్టింపు పారితోషికం నాగబాబు తీసుకుంటున్నారని సమాచారం.గతేడాది ఎన్నికల సమయంలో 41 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టు చూపించగా ఏడాది కాలంలో ఆస్తులు బాగానే పెరిగాయని సమాచారం.

నాగబాబు అదిరింది షో ద్వారా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టినట్టు తెలుస్తోంది.రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు ఎక్కువగా అవకాశం ఉండటంతో నాగబాబు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube