టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోనంటున్న నాగబాబు..  

mega brother naga babu reaction about controversies, naga babu, bomma adirindi show, controversy, family, film industry, tollywood - Telugu Bomma Adirindi Show, Controversy, Family, Film Industry, Mega Brother Naga Babu Reaction About Controversies, Megabrother, Naga Babu, Nagababu, Nagababu Controversies, Tollywood

గత కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, పోస్టుల ద్వారా మెగాస్టార్ సోదరుడు, నటుడు నాగబాబు, బొమ్మ అదిరింది షో జడ్జి వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే.గతంలో బాలయ్య ఎవరో తెలీదంటూ వార్తల్లో నిలిచిన నాగబాబు బొమ్మ అదిరింది షోలో వివాదాస్పదమైన స్కిట్ గురించి వివాదాస్పద పోస్టులు చేశారు.

TeluguStop.com - Mega Brother Naga Babu Reaction About Controversies

నాగబాబు వ్యాఖ్యలు, పోస్టుల గురించి ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.అయితే నాగబాబు తాజాగా ఆ పోస్టుల గురించి, వ్యాఖ్యల గురించి పరోక్షంగా స్పందించారు.
ఈ మధ్య కాలంలో నాగబాబు వల్ల కాంట్రవర్సిటీలు క్రియేట్ అవుతున్నాయనే ఆరోపణలు తన దృష్టికి రావడంతో నాగబాబు మాట్లాడుతూ తాను కాంట్రవర్సీలు క్రియేట్ చేయనని అన్నారు.తాను ఇతరులకు బాధ కలించేలా తప్పులు ఎప్పుడూ చేయనని ఎల్లవేళలా నిజాలు మాత్రమే మాట్లాడతానని తెలిపారు.

అయితే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే మాత్రం అప్పుడు తాను మంచోడిని కాదని అన్నారు.
తమ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వెల్లడించారు.

TeluguStop.com - టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోనంటున్న నాగబాబు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అనవసరంగా ఇతరుల జోలికి వెళ్లడం తనకు నచ్చదని అదే సమయంలో ఇతరులు అనవసరంగా తన జోలికి వచ్చినా ఊరుకోనని తెలిపారు.తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడే వారిపై మాత్రం ఖచ్చితంగా అటాక్ చేస్తానని పేర్కొన్నారు.

తన ఫ్యామిలీపై అనవసరంగా విమర్శలు చేయవద్దని తెలిపారు.
కొంతమంది చేసే విమర్శలకు తాను అస్సలు స్పందించనని.

అర్హత లేని వ్యక్తుల విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.ఇతరుల్లా మనకెందుకు అని తాను ఊరుకోనని.

ఇంట్లో వాళ్ల విషయంలో , ఇండస్ట్రీ విషయంలో విమర్శలు చేస్తే తాను ఖచ్చితంగా ఊరుకోనని నాగబాబు అన్నారు.గత కొంతకాలంగా నాగబాబు అనవసరంగా వివాదాల ద్వారా పాపులర్ అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాగబాబు స్పందించి వివరణ ఇచ్చారు.

#Nagababu #Film Industry #Controversy #Megabrother #BommaAdirindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Brother Naga Babu Reaction About Controversies Related Telugu News,Photos/Pics,Images..