నాగబాబు : బాలయ్య బాబు నాకు అన్నయ్యలాంటి వాడు...

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో నాగబాబు షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు.

 Naga Babu, Mega Brother, Nandamuri Balakrishna, Tollywood Hero, Pawan Kalyan, Po-TeluguStop.com

 దీంతో తన సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.

కాగా తాజాగా నాగబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన తమ్ముడు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహం లెజెండ్ బాలయ్య బాబు కలిసి దిగినటువంటి ఓ పాత ఫోటో ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 అంతేగాక ఈ ఫోటోకి ఇందులో ఒకరు నా తోడబుట్టిన తమ్ముడు మరియు మరో వ్యక్తి దేవుడిచ్చిన సోదరుడని క్యాప్షన్ కూడా పెట్టాడు.
  అంతేగాక మేము సినిమాలను ప్రేమిస్తామని ఆ తర్వాతే మరేదైనా అంటూ పేర్కొన్నాడు.

దీంతో ఈ ఫోటోని ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సేపటిలోనే 17000 పై చిలుకు లైకులు వచ్చాయి.

 అంతేగాక ఈ ఫోటో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఒకే ఫ్రేమ్ లో రెండు సింహాలు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

అలాగే యూట్యూబ్ లో కూడా డైలీ వీడియోలను చేస్తూ  సినీ అభిమానులకి అందు బాటులో ఉంటున్నాడు.అలాగే పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube