రవితేజ హీరోయిజంపై నాగబాబు వైరల్ కామెంట్స్!- Mega Brother Naga Babu Comments On Hero Ravi Teja

mega brother naga babu comments on hero ravi teja ravi teja krack, Ravi Teja, Nagendra Babu, Naga Babu, khiladi, tollywood-khiladi, social media,ramesh,minakshi chiwdary - Telugu Khiladi, Naga Babu, Nagendra Babu, Ravi Teja, Ravi Teja Krack, నాగబాబు, రవితేజ

టాలీవుడ్ నటుడు మాస్ మహారాజ రవితేజ నటన గురించి అందరికీ తెలిసిందే రవితేజ నటించే సినిమాలు యాక్షన్, కామెడీ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తాయి.కాగా ఇటీవలే విడుదలైన క్రాక్ సినిమా భారీ హిట్ ను కొట్టింది.

 Mega Brother Naga Babu Comments On Hero Ravi Teja-TeluguStop.com

దీంతో రవితేజ అభిమానులు, సినీ నటి నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు రవితేజ ఆనందానికి అంతులేకుండా పోయింది.

ఇదిలా ఉంటే రవితేజ నటన గురించి నాగబాబు కొన్ని కామెంట్స్ చేశాడు.

 Mega Brother Naga Babu Comments On Hero Ravi Teja-రవితేజ హీరోయిజంపై నాగబాబు వైరల్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా విడుదలకు ముందే భారీ విజయాన్ని సాధిస్తుందనే విషయాన్ని ఊహించారు.

కాగా ఊహించిన దానికంటే ఎక్కువ విజయం రాగ చిత్రబృందం తమ సంతోషమును వ్యక్తం చేస్తున్నారు.గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ సినిమాలు ఇదివరకే రెండు రాగా అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి.

ఈ సినిమా ముందు నటించిన రవితేజకు ఎలాంటి సక్సెస్ లు రాకపోగా ఈ సినిమా వల్ల రవితేజ కు వరుస ఆఫర్లు ‌ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ విధంగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమం వేదికగా డియర్ మాస్ మహారాజ రవితేజ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు క్రాక్ సినిమాతో నీ శక్తి అనేది ఆరని మంట వలే రుజువు చేశావు.నిన్ను వెండితెరపై చూసిన ప్రతిసారి ఎంతో సంతోషం కలుగుతుంది.

నీ తరువాత సినిమా ఖిలాడీ కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్” అని ట్వీట‌్ చేశారు.

ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్నా ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు.

కాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు గా నటిస్తున్నారు.

#Ravi Teja #Khiladi #Ravi Teja Krack #Nagendra Babu #Naga Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు