నిహారిక చైతన్య మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు ఆరోగ్య పరమైన, ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలందరికీ నష్టమే జరిగినా చాలామంది సెలబ్రిటీలు లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటి వాళ్లయ్యారు.

 Mega Brother  Daughter Niharika Konidela Marriage Date Fixed, Mega Family, Nagab-TeluguStop.com

మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే.గుంటూర్ రేంజ్ ఐజీ కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది.

నాగబాబు గతంలో ప్రకటించిన విధంగానే డిసెంబర్ నెలలో నిహారిక చైతన్య వివాహం జరగనుంది.డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ పూర్ లోని ఉదయ్ విలాస్ లో వివాహం జరగనుంది.

పెళ్లి కొడుకు చైతన్య తండ్రి ప్రభాకర రావు తిరుమలలో స్వామి వారి దర్శనానికి హాజరై అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు.

ప్రభాకర రావు దంపతులు పెళ్లి పత్రికను స్వామి వారి చెంత ఉంచేందుకు తిరుమలకు వచ్చారు.ఇటీవలే హీరోయిన్ కాజల్ వివాహ వేడుక జరగగా త్వరలో నిహారిక వివాహ వేడుక కూడా జరగనుంది.

పరిమిత సంఖ్యలో అతిథులు హాజరైనా ఈ వివాహ వేడుక ఘనంగా జరగనుందని తెలుస్తోంది.ఈ పెళ్లికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

నిహారికకు కాబోయే భర్త చైతన్య ప్రముఖ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఇప్పటికే నిహారిక చైతన్య ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తున్న ఫోటోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అతి తక్కువ మందికి మాత్రమే వివాహ వేడుకకు ఆహ్వానం అందిందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube