అలాంటి వారికి నువ్వే ఆదర్శమంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ప్రశంసలు కురిపించిన మెగా బ్రదర్..!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.బిగ్ బాస్ కి వెళ్లక ముందు కేవలం కొంత మందికి తెలిసిన కొందరు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారి కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నారు.

 Mega Brother Comment On The Bigg Boss Contestant, Bigg Boss 5, Telugu, Priyaka,-TeluguStop.com

ప్రస్తుతం సీజన్ ఫైవ్ లో ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టి విశేషమైన పాపులారిటీ దక్కించుకున్న ప్రియాంక ఒకరు.ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈమె మూడు నాలుగు వారాలలో బయటకు వస్తుందని భావించారు.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 13 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి ఎలిమినేట్ అయ్యారు.ఈ 13 వారాలు ఈమె బిగ్ బాస్ హౌస్ లో వుంటూ విశేష ఆదరణ దక్కించుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు ఈమెకు మద్దతు తెలుపుతూ తను గెలవాలని తన అభిమానులు కూడా తనకు సపోర్ట్ చేయమని కోరారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈమె మెగా బ్రదర్ నాగబాబు ఆశీర్వాదం తీసుకొని తనతో కలిసి ఫోటోలు దిగింది.

Telugu Bigg Boss, Brother, Brotherbigg, Priyaka, Telugu-Movie

ఈ క్రమంలోనే నాగబాబు ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎన్నో అసమానతలు అవమానాలు అడ్డంకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డావు నువ్వు బిగ్ బాస్ విజేత కాకపోయినా ఎంతోమంది ప్రేక్షకుల మదిలో గెలిచావు.నీ గెలుపు వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నువ్వు టైటిల్ గెలవకపోయినా నీకు జరిగిన అవమానాలు తట్టుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావు ఇలా అవమానాలు ఎదుర్కొనే వారికి నువ్వు ఎంతో స్పూర్తిని ఇచ్చావు అంటూ తన గురించి నాగబాబు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube