మెగా బ్రదర్స్ నిర్ణయం ? టీడీపీ కి నిరాశే ? 

ఏదో రకంగా 2024 నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ దారిలోకి తెచ్చుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని తెలుగుదేశం పార్టీ కాచుకుని కూర్చుంది.బిజెపి పొత్తుతో జనసేన నష్టపోయిందని, అదే తెలుగుదేశం పార్టీతో ఉండి ఉంటే పవన్ కు ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని, తాము గౌరవంగా చూసుకునే వారిమనే అభిప్రాయాన్ని జనసేన లో కలిగించేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.

 Janasena, Bjp, Tdp, Ysrcp, Ap, Megastar Chiranjeevi, Mega Borthers, Somu Veerraj-TeluguStop.com

ఇక బిజెపి సైతం పవన్ చరిష్మా నే నమ్ముకుంది.తమకు ఏపీలో క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంతో , జనసేన బలాన్ని నమ్ముకొని రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారం దక్కించుకోకపోయినా, గౌరవప్రదమైన స్థానాలు దక్కుతాయని బిజెపి అంచనా వేస్తోంది.

ఎలా చూసుకున్నా పవన్ ను అటు బిజెపి ఇటు టిడిపి  వదులుకునేలా కనిపించడం లేదు.

టిడిపితో పొత్తు పెట్టుకున్న పవన్ ను సిఎం చేసే అవకాశాలు లేవు.

చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే సీఎం కుర్చీలో కూర్చుంటారు.ఇక బిజెపి ఎప్పుడో తమ రెండు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ ప్రకటించేసింది.

ఈ విషయంలో పవన్ సంతృప్తి చెందారు.కానీ పవన్ టిడిపి వైపు వస్తున్నారు అంటూ టిడిపి , ఆ పార్టీకి అనుకూల మీడియా పదే పదే ప్రచారం చేస్తోంది.

కానీ పవన్ మాత్రం అసలు టిడిపి వైపు వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదట.

Telugu Chandrababu, Janasena, Borthers, Chiranjeevi, Lokesh, Somu Veerraju, Ysrc

ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనవసర విమర్శలు ఎదుర్కోవాలని, ప్రజల్లో జనసేన నమ్మకం కోల్పోతుందని పవన్ అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే టిడిపి,  జనసేన ఒకటే అని , చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ పని చేస్తున్నారని వైసిపి అదేపనిగా ప్రచారం చేస్తోంది.మళ్లీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ వాదనలో నిజం ఉందని జనాలు నమ్మే ఛాన్స్ ఉంది అనేది పవన్ భయం.

అందుకే ఇకపై కొత్త పొత్తు గురించి ఆలోచించకుండా , పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టారట.వైసిపి , టిడిపిలో బలాన్ని తగ్గించి తాము ఆ స్థానాన్ని ఆక్రమించాలి అని పవన్ చూస్తున్నారు.

ఆ రెండు పార్టీలకు మెజారిటీ సీట్లు రాకపోతే, తామే కీలకం అవుతామని అప్పుడు ముఖ్యమంత్రి స్థానం తీసుకోవచ్చనే ఆలోచనలు ఉన్నారట.అది సాధ్యం కాకపోతే ఎన్నికల తరువాత టిడిపి మద్దతు తీసుకోవచ్చు అనేది పవన్ అభిప్రాయమట.

ఇదే విషయాన్ని పవన్ కు మెగాస్టార్ చిరంజీవి సైతం సూచించినట్లు తెలుస్తోంది.ఆయన కూడా త్వరలోనే పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు.అది కూడా జనసేన ద్వారానే అనే ప్రచారం జరుగుతోంది.గతంలో ప్రజారాజ్యం పూర్తిగా దెబ్బ తినడానికి కారణం టిడిపి,  ఆ పార్టీ అనుకూల మీడియా అనే విషయాన్ని చిరు మర్చిపోలేదు.

అందుకే వీలైనంత దూరంగా వారిని  పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.మెగా బ్రదర్స్ ఇద్దరూ జనసేన ను అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా త్వరలోనే కార్యాచరణ ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube