బొగ్గు సంక్షోభాన్ని అధిగమించడానికి కి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం..!!

దేశంలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో… దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ఏపీలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలని బొగ్గు సమస్య కొరత తీర్చాలని… కేంద్రానికి సీఎం జగన్ లెటర్ రాయడం జరిగింది.

 Meeting Under The Auspices Of Amit Shah To Overcome The Coal Crisis Amit Shah, C-TeluguStop.com

ఒక ఏపీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడటంతో కేంద్రం అలర్ట్ అయింది.తాజాగా హోం శాఖ మంత్రి అమిత్ షా … బొగ్గు శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు.

Telugu Amit Shah, Ap Cm Jagan, Ap, Ap Problems, Ysrcp-Telugu Political News

గత కొన్ని రోజుల నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు పెద్ద సమస్యగా మారడంతో… బొగ్గు సంక్షోభాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలపై.బొగ్గు శాఖ ఉన్నతాధికారులతో మంత్రులతో.అమిత్ షా చర్చిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి తగ్గటం.ధరలు పెరగటంతో… షార్ట్ యేజ్ ఏర్పడింది.కరోనా కాలంలో బొగ్గు ఉత్పత్తి కంపెనీలు చాలా వరకు మూతపడ్డాయి.

దీంతో ఏర్పడిన నష్టాలను పూడ్చడానికి… ఆయా కంపెనీలు ధరలు ఒక్కసారిగా పెంచేశాయి.ఈ పరిణామంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రమైంది.

దేశంలో 70 శాతం విద్యుత్తు ఉత్పత్తి బొగ్గు తోనే తయారవుతుంది.దీంతో బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవడానికి కేంద్రం… బొగ్గు శాఖ అధికారులతో మంత్రులతో చర్చలు స్టార్ట్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube