జంబలకిడిపంబ : వందల మంది సమక్షంలో వరుడి మెడలో తాళి కట్టిన వధవు.. ఎక్కడో కాదు మన పక్కనే  

Meet The New Age Brides Tying Mangalsutras To Grooms-distinctive Wedding,grooms,karnataka,vijayapura District

హిందూ సాంప్రదాయంలో పెళ్లిలు రకరకాలుగా జరుగుతాయి. హిందూ మతంకు చెందిన వారు అంతా కూడా ఒకే రకంగా పెళ్లి తంతు నిర్వహించరు. అయితే ఎవరు ఎలా పెళ్లి చేసినా కూడా ఒక విషయంలో మాత్రం అంతా కామన్‌గా ఉంటుంది..

జంబలకిడిపంబ : వందల మంది సమక్షంలో వరుడి మెడలో తాళి కట్టిన వధవు.. ఎక్కడో కాదు మన పక్కనే-Meet The New Age Brides Tying Mangalsutras To Grooms

అదే తాళి కట్టడం. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అంటే ఖచ్చితంగా అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టే సీన్‌ ఉంటుంది. తాళిలో కూడా సాంప్రదాయాలకు తగ్గట్లుగా విభిన్నంగా ఉండవచ్చు.

కాని తాళి అనేది ఖచ్చితంగా అబ్బాయి స్వయంగా అమ్మాయి మెడలో కట్టడం మనం చూస్తూ ఉంటాం.

దేవతల పెళ్లిల్లు కూడా అలాగే జరుగుతాయి. ఉదాహరణకు రాముడి చేతులు తాకించి అయ్యవార్లు సీతమ్మ వారి మెడలో తాళి కట్టడం మనం చూస్తాం.

ఇంకా అనేక స్వామి వారి కళ్యాణాల్లో కూడా అదే తంతు జరుగుతుంది. కాని బసవణ్ణ సిద్దాంతం ప్రకారం మాత్రం అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టకుండా రివర్స్‌లో అంటే అబ్బాయి మెడలో అమ్మాయిలు తాళి కట్టడం ఉంటుంది. ఈ సిద్దాంతం ప్రకారం అప్పట్లో పెళ్లిలు జరిగేవి.

కాని పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో వారు కూడా అమ్మాయిల మెడలోనే తాళి కట్టడం మొదలు పెట్టారు. అయితే అంకిత మరియు అమిత్‌లు విరుద్దంగా పాత పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా ముద్దే బిహాళ్‌ తాలూకా నాలతవాడ అనే చిన్న గ్రామంలో ఈ వింత పెళ్లి జరిగింది. కుటుంబ పెద్దలు మరియు బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరు అయిన ఈ కళ్యాణ వేడుకలో అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టింది.

పెళ్లికి హాజరు అయిన వారిలో కొందరికి ఈ పెళ్లి విషయం తెలియక అక్కడే చూసి నోరెళ్లబెట్టారు. బసవణ్ణ సిద్దాంతంను ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు. ఎందుకు మీరే పాటించారు అని వారిని ప్రశ్నించగా మనకు మంచిది అనిపిస్తే పాటించడంలో తప్పేం ఉంది..

మాకు ఆ సిద్దాంతం బాగుందనిపించింది, అందరికి భిన్నంగా ఉంటుందని ఇలా చేశామని కొత్త దంపతులు అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా అమిత్‌ మెడలో తాళి ఉంటుంది. అంకిత కాళ్లకు మెట్టెలు ధరించి, మెడలో నల్ల పూసలు ధరిస్తుంది.