ఆమె చెప్పిన చిన్న మాట అతడిని అంత ప్రభావితం చేసిందట!

మనం చిన్నప్పుడు మన అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే అప్పుడు వింటాం వెంటనే మర్చిపోతాం.

కానీ వాటిని కొంతమంది మాత్రమే పెద్దయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని ఆచరిస్తారు.

ఈ రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు చెప్పారని వాళ్ళ మాట ఎవరు వింటున్నారు.అందులోను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన ఒక చిన్న మాటను గుర్తు పెట్టుకుని ఆలోచిస్తారు.

కానీ కొంతమంది మాత్రం పెద్ద వాళ్ళు చెప్పే మాటలకూ ప్రభావితం అవుతూ ఉంటారు.ఎంత చదువు చదివిన ఉద్యోగాలు చేస్తున్న కూడా పెద్ద వారు చెప్పిన విషయాన్నీ మర్చిపోరు.

అలంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.అతడు భూపాల్ కు చెందిన వ్యక్తి.

Advertisement

అతడి పేరు సుయాస్.అతడికి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమట.

జంతువులు అంటే ఆసక్తి ఎక్కువుగా ఉంది.సుయాస్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి జూకి వెళ్ళాడట.

అప్పుడు సుయాస్ బోన్ లో ఉన్న జంతువులను చూసి ఆనందంగా కేకలు వేస్తుంటే.అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నువ్వు ఆనందంగా ఉన్నావు కానీ అవి మాత్రం ఆనందంగా లేవని చెప్పిందట.అవి అడవిలో ఉంటేనే ఆనందంగా ఉంటాయని చిన్న మాట చెప్పిందట.

ఇక అప్పటి నుండి సుయాస్ జంతువుల గురించే ఆలోచించడం మొదలు పెట్టాడు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఆ తర్వాత బాగా చదివి మంచి ఉద్యోగం కూడా తెచుకున్నాడు.కానీ ఆలోచించడం మాత్రం మానలేదట.ఎప్పుడు అడవిలో ఉండే జంతువుల గురించే ఆలోచించేవాడట.

Advertisement

ఇక ఇప్పుడు అతడు అడవి అనే డాక్యుమెంటరీ ఫీల్మ్ ను చిత్రీకరించాడట.ఈ ఫిలిం కి వరల్డ్ లైఫ్ ఫండ్ నేచర్ నిధులను సమకూర్చిందట.

వైల్డ్ లైఫ్ జంతువులను కాపాడి అవి మనుగడ సాగించేలా చేయాలన్నది సయాస్ కల అని అతడు చెబుతున్నాడు.వాళ్ళ అమ్మమ్మ చెప్పిన చిన్న మాట బుర్రలో పెట్టుకుని ఇప్పుడు ఆ జంతువుల కోసం అంత చేయాలని అనుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు.

తాజా వార్తలు