అమెరికాలో 18 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసి: మాతృభూమి సేవలో ‘‘ శ్రీమంతుడు ’’  

Meet Sridhar Vembu, the billionaire who turns schoolmaster for rural kids in Tamil Nadu, Tamil Nadu, Rural kids, Billionarie, Free Education, Hospitals, NRI - Telugu Billionarie, Free Education, Hospitals, Meet Sridhar Vembu, Nri, Rural Kids, Tamil Nadu, The Billionaire Who Turns Schoolmaster For Rural Kids In Tamil Nadu

లక్షల రూపాయల సంపదను కోట్లుగా, కోట్ల రూపాయలను వందల కోట్లుగా మార్చే క్రమంలో మనుషులు తీరిక లేకుండా గడుపుతున్నారు.స్వదేశంలో అవకాశం లేకపోతే విదేశంలోనైనా అనుకున్నది సాధించాలని అక్కడికి వెళ్తున్నారు.

TeluguStop.com - Meet Sridhar Vembu The Billionaire School Master Tamil Nadu

వీరిలో కొందరు ఎన్ని కోట్లను సంపాదించినా సంతృప్తి చెందరు.నిజానికి గొప్పగా సంపాదించిన వాడు ఎప్పటికీ శ్రీమంతుడు కాలేడు.

ఉన్నత విలువలు, సేవాగుణం ఉన్నోడే శ్రీమంతుడు.పుట్టిన మూలాలు మరచిపోకుండా కోట్లాది సంపదను మాతృభూమి రుణం తీర్చుకోవడానికే వెచ్చించాలని నిర్ణయం తీసుకునే వాడు గొప్పవాడు.

TeluguStop.com - అమెరికాలో 18 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసి: మాతృభూమి సేవలో ‘‘ శ్రీమంతుడు ’’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ రెండో కోవకు చెందిన వారే శ్రీధర్ వెంబు.

తమిళనాడులోని మాథాలంపరై అనే మారుమూల గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించారు శ్రీధర్ (53).

ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్యను అభ్యసించి అనంతరం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.అక్కడ ప్రపంచ ప్రసిద్ధ సిలికాన్ వ్యాలీలో జోహో కార్పోరేషన్‌ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 18,000 కోట్లు.సాధారణంగా ఇంతటి కుబేరుడి తర్వాతి ఆలోచన ఏమై ఉంటుంది.

వున్న సంపదను రెట్టింపు చేయడం లేదంటే, జాగ్రత్తగా కాపాడుకోవడం.కానీ అవన్నీ వదిలేసి తాను పుట్టి పెరిగిన మట్టి వాసనలు వెతుక్కుంటూ భారతదేశం వచ్చేశారు శ్రీధర్.

పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం.లాక్‌డౌన్‌లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.ప్రస్తుతం ఆ సంఖ్య 25 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు చేరింది.ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ చదువు చెప్పిస్తున్నారు.అంతేకాదు త్వరలో శ్రీధర్ ఓ ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా అత్యాధునిక వసతులతో హాస్పిటళ్లు నిర్మించడం, సాగునీటిని అందించడం, మార్కెట్లు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రేమ లక్ష్మీనారాయణ్ అనే వైద్యురాలు ట్విట్టర్ ద్వారా శ్రీధర్ వెంబు గురించి బయటి ప్రపంచానికి బహర్గతం చేశారు.ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీధర్ గొప్పదనాన్ని కీర్తిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

#Tamil Nadu #Free Education #Hospitals #Billionarie #Rural Kids

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meet Sridhar Vembu The Billionaire School Master Tamil Nadu Related Telugu News,Photos/Pics,Images..