చెత్త డబ్బా దగ్గర దొరికిన ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరో కూతురని మీకు తెలుసా?

బాలీవుడ్ సినిమాలలో నటించడం ద్వారా మిధున్ చక్రవర్తి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే.మిధున్ చక్రవర్తి బెంగాళీ అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

 Meet Dishani Chakraborthy Mithun Daughter Who Adopted After She Left In Garbage,-TeluguStop.com

డిస్కో డ్యాన్సర్ అనే సినిమా నటుడిగా మిధున్ చక్రవర్తికి మంచి పేరును తెచ్చిపెట్టింది.మిధున్ చక్రవర్తి నటనకు పలు పురస్కారాలు లభించాయి.

మిధున్ చక్రవర్తి ఉత్తమ నటుడిగా అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఉత్తమ సహాయనటుడిగా కూడా అవార్డులను పొందారు.అయితే ఈ మిధున్ చక్రవర్తి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో కావడం గమనార్హం.

మిధున్ చక్రవర్తికి నిజ జీవితంలో ఉష్మే, నమషి, మహాక్షయ్ పేర్లతో ముగ్గురు కొడుకులు ఉన్నారు.వీరితో పాటు దిశానీ పేరుతో ఒక కూతురు కూడా ఉన్నారు.

అయితే దిశానీ దత్త పుత్రిక కావడం గమనార్హం.

Telugu Bengali, Bollywood, Cound Garbage, Garbage-Movie

చెత్త డబ్బా దగ్గర ఏడుస్తున్న ఒక చిన్నారికి సంబంధించిన వార్త మిధున్ చక్రవర్తిని కదిలించింది.ఆ పాప ముఖం చూడగానే తనకు, ఆ పాపకు ఏదో తెలియని అనుబంధం ఉందని మిధున్ చక్రవర్తికి అనిపించింది.ఆ తర్వాత మిధున్ భార్యతో మాట్లాడి చిన్నారిని ఇంటికి తీసుకొని వచ్చాడు.

ఆ తర్వాత మిధున్ దంపతులు దత్తత కార్యక్రమాలను పూర్తి చేశారు.

Telugu Bengali, Bollywood, Cound Garbage, Garbage-Movie

దిశానీ చక్రవర్తి ప్రస్తుత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం దిశానీ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంటున్నారు.హోలీ స్మోక్ ఆనే లఘు చిత్రం ద్వారా ఇప్పటికే ప్రేక్షకులకు సుపరిచితమైన దిశానీ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తారేమో చూడాల్సి ఉంది.

అందంగా ఉన్న దిశాని భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.దిశానీకి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube