42 ఏళ్ల తర్వాత భారతదేశానికి, తనతో పాటు మరో 50 కుటుంబాలను కూడా.. రివర్స్ మైగ్రేషన్‌‌కి కృషి చేస్తున్న ఎన్ఆర్ఐ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.

 Meet Avtar Singh Azad Who Came Back To India After Spending 42 Years In England-TeluguStop.com

మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను( NRI ) కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.1947-48 తర్వాత పంజాబ్ నుంచి పాశ్చాత్య దేశాలకు వలసలు ప్రారంభమవ్వగా.60వ దశకం నాటికి ఇవి మరింత పుంజుకున్నాయి.2016 నుంచి 2021 మార్చి మధ్య కేవలం ఐదేళ్ల కాలంలోనే 4.78 లక్షల మంది పంజాబీలు విదేశాలకు వెళ్లారు.ఈ కాలంలో 2.62 లక్షల మంది భారతీయ విద్యార్ధులు చదువుల కోసం విదేశాలకు వెళ్లగా.ఈ విభాగంలో పంజాబ్ ( Punjab ) మూడో స్థానంలో నిలిచింది.2016 నుంచి 2021 మధ్య 1.26 లక్షల మంది పంజాబీ విద్యార్ధులు చదువుల కోసం విదేశాలకు వెళ్లారని అంచనా.ప్రతి ఏడాది దాదాపు లక్ష మంది విద్యార్ధులు పంజాబ్‌ను వీడుతున్నారట.

Telugu England, America, Bahua, Birmingham, India, Punjab, Punjab Nri, Reverse,

ఆసక్తికరంగా 75 ఏళ్ల తర్వాత పంజాబ్ ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్‌ను( Reverse Migration ) కూడా చూస్తోంది.ఇందుకు ఈ ఎన్ఆర్ఐ గాథే ఉదాహరణ.ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో 42 ఏళ్ల పాటు గడిపిన అవతార్ సింగ్ ఆజాద్( Avtar Singh Azad ) పంజాబ్‌కు తిరిగివచ్చేశారు.ఆయన ఫగ్వారా సమీపంలోని బహువాలో ఎన్ఆర్ఐ రసోయ్ పేరుతో హోటల్ నడుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.డబ్బు సంపాదనే ధ్యేయంగా కాలేజీ పూర్తి చేసుకున్న అనంతరం యూకేకు వలస వెళ్లినట్లు చెప్పారు.

అక్కడ 42 ఏళ్లు గడిపిన తర్వాత తాను సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చానని అవతార్ సింగ్ తెలిపారు.ఉపాధి అవకాశాలు కల్పించడం, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Telugu England, America, Bahua, Birmingham, India, Punjab, Punjab Nri, Reverse,

1947లో భారత ఆర్ధిక వ్యవస్థ 51వ స్థానంలో వుండగా.ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని అవతార్ సింగ్ తెలిపారు.అమెరికన్లు భారత్‌లోని కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఒక భారతీయుడు బ్రిటన్‌కు ప్రధాన మంత్రి , మరో భారతీయుడు అమెరికాకు ఉపాధ్యక్షుడిగా కాగలిగినప్పుడు భారతీయులు భారత్‌ను ఎందుకు నడపలేరని అవతార్ సింగ్ ప్రశ్నించారు.తానొక్కడినే భారత్‌కు రాకుండా.52 పంజాబీ కుటుంబాలను ఆయన బహువాకు వెనక్కి తీసుకురావడంలో విజయం సాధించారు.వీరిలో దాదాపు డజను కుటుంబాలు ఇప్పుడు ఆజాద్‌లాగే వ్యాపారాలు నిర్వహిస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube