క్రేజీ ట్విన్స్‌.‌. గర్భం కూడా ఓకే బాయ్ ఫ్రెండ్ తో కావాలట‌!

ఎక్కడైనా కవలలను చూసే చూడముచ్చటగా కనిపిస్తారు.ఒకే రూపంతో ఒకే పోలికలతో ఉండే కవలలు చూసినప్పుడు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది.

 Meet Australian Twin Sisters Who Sleep Together Eat Together And They Want To Ge-TeluguStop.com

ఒకలాగే ఉండే బట్టలు ధరించడం, ఒకలాగే మాట్లాడటం ఇలా ఎంతోమంది కవలల్లో చూస్తుంటాం.ఇక వారి ఆలోచనలు కూడా ఒకే లాగా ఉంటాయి.

ఇదిలా ఉంటే ఓ చోట కవలలు వారిద్దరూ చూడటానికి ఒకేలా ఉండటమే కాకుండా వాళ్ల అభిరుచులు కూడా ఒకే లాగా ఉన్నాయి.కానీ వారిద్దరికీ గర్భం ఒక బాయ్ ఫ్రెండ్ తోనే కావాలట.

ఆస్ట్రేలియాకి చెందిన అనా, లూసీ డెసింక్ అనే ఇద్దరు కవల అమ్మాయిలు.వీరిద్దరూ చూడటానికి ఒకేలాగా ఉంటారు.ఇక వీరిద్దరి నిర్ణయాలు కూడా ఒకేలా ఉన్నాయి.ఇద్దరు కలిసి ఆహారం తినడం, కలిసి పడుకోవడం, కలిసి బాత్రూం కి వెళ్ళడం, కలిసి స్నానం చేయడం ఇవన్నీ వీరిద్దరు కలిసే చేస్తారట.

సరే ఈ విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటారనుకుందాం కానీ పిల్లల్ని కనడానికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ తోనే కనాలనుకుంటున్నారట‌.

Telugu Australian, Boy Friend, Pregnant, Twin Sisters-Movie

వినడానికి కాస్త వింతగా ఉన్నా వీరిద్దరూ ఒక బాయ్ ఫ్రెండ్ తోని పిల్లల్ని కనాలనుకుంటున్నారట.ఈ విషయాన్ని ఇటీవల ఇద్దరు కవలలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.చిన్నప్పటి నుంచి వారిద్దరు ఒకే తరహా డిజైన్ డ్రెస్సులు వేసుకునే వారిని, ప్రతిదీ కలిసి చేసే వాళ్ళమని తెలిపారు.

అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఒకే వ్యక్తితో ప్రేమలో పడ్డారట‌.అంతే కాకుండా అతన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నారంట.ఇద్దరు కలిసి ఒకేసారి గర్భం దాల్చాలనుకుంటున్నారట.

ఈ ఇద్దరు కవలలు బెన్ అనే మెకానిక్ వ్యక్తితో 2012లో ప్రేమలో పడ్డారట‌.

ఇక అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట‌.అన్ని బాగా ఉండేసరికి ఒక సమస్య ఎదురయ్యింది ఈ కవలలకి‌.అదేంటంటే ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తిని ఇద్దరు చేసుకుంటే చట్టం ఒప్పుకోదు.1961 చట్టం ప్రకారం ఏ వ్యక్తిని కూడా ఒకేసారి ఇద్దరితో పెళ్లి చేసుకోకూడదు అనే చట్టాన్ని విధించారు.దీంతో ఈ కవలల ఆశ నిరాశగా మారింది.ఇంతకీ వీళ్ళ ప్రేమను ఆ చట్టం ఒప్పుకుంటుందా లేదా వీళ్లే మరొకరికి తమ ప్రేమను వదిలేస్తారా అర్థం కాని పరిస్థితిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube