మూతపడబోతున్న మీసేవ సెంటర్లు ..?   Meeseva Centers Closed On Telangana Opereters Disided     2018-10-26   17:40:19  IST  Sai M

తెలంగాణాలో మీసేవా సెంటర్లు మూతపడే ఛాన్స్ కనిపిస్తోంది. 2011లో మొద‌లైన మీసేవ సెంట‌ర్ల ద్వారా ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ‌లో తొలుత 500 సెంట‌ర్ల‌తో ప్రారంభ‌మైన మీసేవ ఇప్పుడు 4500 సెంట‌ర్ల‌కు విస్త‌రించింది. కానీ, అప్పుడెప్పుడో నిర్ణ‌యించిన ధ‌ర‌ల కార‌ణంగా తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని, త‌మ‌కు ప‌దేళ్ల క్రితం నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌ను, ప్ర‌స్తుత ఖ‌ర్చుల‌ను లెక్క‌లోకి తీసుకుని కొత్త రేట్లను ప్ర‌క‌టించాల‌ని మీసేవ నిర్వాహ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ డిమాండ్ ఎప్ప‌ట్నుంచో ఉన్న‌ప్ప‌టికీ, దీనిపై ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. దీంతో, మీసేవ సెంట‌ర్ల నిర్వాహ‌కులంతా జేఏసీగా ఏర్ప‌డి, ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌కుంటే న‌వంబ‌ర్ 1నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల‌ను బంద్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీసేవ సెంటర్ల మీద ఆధారపడి ప్రభుత్వ సర్వీసులు ఎన్నో జరుగుతున్నాయి. ఇక తెలంగాణాలో ఎన్నికల నేపథ్యంలో వీరు కనుక సమ్మెకు దిగితే ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.