ఆ బాలిక నోట్లో బాంబు పెట్టి ఆ కుర్రాడు ఏం చేసాడంటే...?   Meerut Boy Sets Off Sutli Bomb In Girl Mouth Victim In Critical     2018-11-08   18:19:49  IST  Sai M

అప్పటివరకు అక్కడ అందరూ … ఆనందంగా దీపావళి చేసుకున్నారు. అయితే అక్కడ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో … పేలుడు చోటు చేసుకోవడం తో ఒక్కసారిగా అందరిలోనూ ఒకటే కంగారు. తీరా చూస్తే… అక్కడ చోటు చేసుకున్న పరిణామంతో అంతా షాక్ తిన్నారు. ఇంతకీ ఏమైందంటే… ? దీపావళి వేడుకల్లో ఓ ఆకతాయి ఏంచేసాడంటే… బాలిక నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. తీవ్రగాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ సమీపంలో జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

మిలాక్‌ అనే గ్రామంలో మంగళవారం రాత్రి పిల్లలందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఓ మూడేళ్ల బాలిక కూడా తన ఇంటి ముందు ఆడుకుంటోంది. బాలికను గమనించిన హర్పాల్ అనే బాలుడు అక్కడికి వచ్చాడు. సుట్లీ బాంబ్ తీసుకొచ్చి బాలిక నోట్లో పెట్టి.. నిప్పంటించాడు. వెంటనే బాంబ్ పేలి పెద్ద శబ్ధం వచ్చింది. తీవ్ర గాయాలతో బాలిక పెద్దగా కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

స్థానికుల్ని చూసి భయపడిన బాలుడు.. అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక గొంతు భాగానికి తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితురాలికి దాదాపు 50 కుట్లు పడ్డాయని.. పరిస్థితి విషమంగానే ఉందంటున్నారు. మరోవైపు బాధితురాలి తండ్రి శశికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాపం తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకోవాల్సిన బాలిక ఇలా ఆస్పత్రిపాలవ్వడం బాధాకరమంటున్నారు స్థానికులు.