ఆ తెలుగు హీరోయిన్ కి కుల పిచ్చి ఎక్కువంటున్న కోలీవుడ్ నటి...

తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకి చెందినటువంటి నటి “మీరా మిథున్” టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ “త్రిష కృష్ణన్” పై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా త్రిషా కృష్ణన్ కి తమిళ సినీ పరిశ్రమకి సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని తొందర్లోనే ఆమె వీడియోలను బయట పెడతానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

 Meera Mithun, Kollywood Heroine, Sensational Comments, Trisha Krishnan, Telugu-TeluguStop.com

అయితే తాజాగా మరోమారు మీరా మిథున్ నటి త్రిష కృష్ణన్ పై కుల ప్రస్తావన తెస్తూ తీవ్ర విమర్శలు చేసింది.ఇందులో భాగంగా నటి త్రిష కృష్ణన్ కి కుల పిచ్చి ఎక్కువని దాంతో  ఎక్కువగా ఆమె సామాజిక వర్గానికి చెందిన నటీనటులకు అవకాశాలు దక్కేలా తనకున్న పలుకు బడితో చూస్తుందని ఈ క్రమంలో తనకు అవకాశాలు దక్కకుండా చేసిందని వాపోయింది.

అంతేగాక మొదట్లో తాను పలు చిత్రాలలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ త్రిషా కృష్ణన్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ అవకాశాలను లాగేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుతం మీరా మిథున్ కి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాలు లేవని అందువలనే ఇలా సెలబ్రెటీ హీరోయిన్ అయిన త్రిష కృష్ణన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే ఈ మధ్యకాలంలో కొందరు ఫెమస్ అవ్వాలని సెలబ్రిటీలను తీవ్రంగా విమర్శిస్తూ వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని త్రిష అభిమానులు మీరా మిథున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి మీరా మిథున్  త్రిష అభిమానులు చేస్తున్నటువంటి ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube