మీరా జాస్మిన్ ''అన్న'' బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

మీరా జాస్మిన్.ఈ హీరోయిన్ ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు.ఎంతో అందంగా.అమాయకంగా కనిపించే ఈ మీరా జాస్మిన్ మంచి నటనతో ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.మంచి మంచి సినిమాల్లో నటించింది ఉన్నట్టుండి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.అయితే ఇప్పుడు ఆమె పేరు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

 Meera Jasmine, Arjan Bajwa, Bjp, Badra Film, Bhadhra, Meera Jasmin, Arjan Bajwa,-TeluguStop.com

మీరా జాస్మిన్ అన్న అంటే నిజమైన అన్న కాదు.భద్ర సినిమాలో ఆమెకు అన్నగా నటించిన వ్యక్తి గురించి చెప్పేది.మీరా జాస్మిన్ నటించిన మంచి సినిమాల్లో ఒకటి భద్ర.బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు.

ఇక అతడికి స్నేహితుడుగా మీరా జాస్మిన్ కు అన్నగా నటించిన వ్యక్తే అర్జన్ బజ్వా.

మన తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించిన ఈ నటుడు బ్యాగ్రౌండ్ చాలానే ఉంది. అర్జన్ బజ్వా తండ్రి ఓ రాజీకీయ నాయకుడట.అర్జన్ బజ్వా తండ్రి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో ప్రముఖమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.గతంలో ఢిల్లీ నగరానికి అతడు మేయర్ గా కూడా పని చేశారట.

ఢిల్లీలో పుట్టి పెరిగిన అర్జన్ బజ్వా తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

సినిమాలపై ఆసక్తి ఉండటం వల్ల చదువుకునే రోజుల నుంచే సినిమాల్లో నటించాడు. 2001 లో సంపంగి అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అర్జన్ బజ్వా ఆతర్వాత భద్ర, కనులు మూసినా నీవాయే, ప్రేమలో పావని కళ్యాణ్, కింగ్, అరుంధతి, మిత్రుడు, నిప్పు, చిత్రాంగదా, రంభ ఊర్వశి మేనక వంటి సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు.

కానీ పెద్దగా అవకాశాలు లేక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube