తారక్ స్పందించక పోవడం పై కామెంట్ చేసిన మీరా చోప్రా  

Meera Chopra Jr Ntr Ntr Fans - Telugu Cyber Crime, Jr Ntr, Meera Chopra Once Again Reacts On Ntr Fans, Social Media, South Cinema, Telugu Cinema, Tollywood

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకప్పటి హీరోయిన్ మీరా చోప్రా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వెర్బల్ వార్ తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ కంటే తాను మహేష్ బాబును ఇష్టపడతానని మీరా చోప్రా చేసిన కామెంట్స్ పై తారక్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడి ఆమెపై అసభ్య పదజాలంతో కామెంట్స్ పోస్ట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు.

 Meera Chopra Jr Ntr Ntr Fans

దీనిపై ఆమె మహిళా హక్కుల కమిషన్ సాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై యాక్షన్ తీసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రెడీ అవుతున్నారు.

మీరా చోప్రాపై దారుణ పదజాలంతో కామెంట్ చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.అయితే అంతకంటే ముందుగానే ఆమె తనని దూషిస్తున్న అభిమానులను కంట్రోల్ చేయాలని తారక్ ని కూడా ట్విట్టర్లో కోరింది.

తారక్ స్పందించక పోవడం పై కామెంట్ చేసిన మీరా చోప్రా-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఎన్టీఆర్ నుంచి ఆమెకు ఎలాంటి స్పందనా రాలేదు.ఈ క్రమంలో ఆమె మరోసారి స్పందించారు.

ఈ ప్రపంచంలో ఎవరిని అభిమానించాలనేది తన ఇష్టం అని స్పష్టం చేశారు.సోషల్ మీడియా ఇప్పుడొక దుర్భరమైన ప్రదేశంగా మారిపోయిందని, ఈ వివాదం మొదలయ్యాక తనకు వేధింపులు, బెదిరింపులతో కూడిన 30 వేల ట్వీట్లు వచ్చాయని వెల్లడించారు.

ఈ సైబర్ వేధింపులపై స్పందించకపోతే తప్పు చేసినట్టేనని, అందుకే హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను ఢిల్లీలో నివాసం ఉంటుండడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేశానని మీరా చోప్రా వివరించారు.హీరోలు తమ అభిమానుల గ్రూప్ ల గురించి తెలుసుకోవాలని, ఇలాంటి ధోరణులను ఖండించాలని అన్నారు.

హీరోలు చెబితే ఫ్యాన్స్ కచ్చితంగా వింటారని మీరా అభిప్రాయపడ్డారు.హీరోలు తమ అభిమానులను కంట్రోల్ చేయకపోవడం కొంత బాధాకరమని ఆమె తన పోస్టు ద్వారా వ్యక్తం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meera Chopra Jr Ntr Ntr Fans Related Telugu News,Photos/Pics,Images..

footer-test