మాకు ఇంకా పెళ్లే కాలేదు అప్పుడే విడాకులు ఏంటంటున్న ప్రముఖ నటి...  

Meera Anil Reacts About Her Marriage Comments-anchor Meera Anil Marriage,meera Anil,meera Anil Latest News,meera Anil Marriage News

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఏం చేసినా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకోవడం కామన్ గా వస్తున్నటువంటి ఆనవాయితీ.అయితే ఇందులో భాగంగానే తాజాగా మలయాళ నటి మరియు యాంకర్  అయినటువంటి మీరా అనిల్ కేరళకు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

Meera Anil Reacts About Her Marriage Comments-Anchor Meera Latest News

ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది.దాంతో ఈ విషయాన్ని ఈ అమ్మడు తన అభిమానులతో పంచుకుంది.

దీంతో కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారంటూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.అలాగే దానికి వివరణ కూడా ఇస్తున్నారు.ప్రస్తుతకాలంలో మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు పెళ్ళైన కొద్ది కాలంలోనే విడాకుల బాట పట్టారు.దీంతో ఈ సెగ  మీరా అనిల్ కి కూడా తగిలింది.

  ఈ విషయంపై తాజాగా మీరా అని స్పందించారు.పెళ్లి చేసుకునేది విడాకులు తీసుకోవడం కోసం కాదని మరియు తమది పెద్దలు కుదిర్చిన వివాహమని అంతేగాక తనకు కాబోయే భర్త పై తనకు పూర్తిగా విశ్వాసం మరియు ప్రేమ ఉన్నాయని అన్నారు.

మీరు కూడా పెద్దలు కుదిర్చిన వివాహం పై నమ్మకం ఉంచి చి ఆ వివాహాన్ని గౌరవించాలని అన్నారు.అంతే కాకుండా ఇలా సామాజిక మాధ్యమాల్లో విడాకులు ఎప్పుడు అంటూ ప్రశ్నించడం సరికాదని ఇలాంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

అయితే పెళ్లయిన తర్వాత కూడా తన భర్త అభీష్టం మేరకు నటించాలని అనుకుంటున్నానని మీరా అనిల్ తెలిపారు. 

.

తాజా వార్తలు