మహేష్‌ మూవీలో మీనాక్షీ దీక్షిత్‌, కాని చిన్న ట్విస్ట్‌ ఏంటంటే..!     2018-12-05   10:24:43  IST  Ramesh P

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం మహర్షిలో నటిస్తున్న విషయం తెల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన పల్లెటూరు సెట్‌లో జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ మీనాక్షీ దీక్షిత్‌ పాల్గొంటుందట. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మీనాక్షీ దీక్షిత్‌ ఈ చిత్రంలో కీలకంగానే కనిపించే అవకాశం ఉందట.

Meenakshi Dixit In Mahesh Babu Movie-Maharshi Movie Rishi

కీలకంగా కనిపించనున్న విషయం నిజమే కాని, మహేష్‌ బాబుకు జతగా మాత్రం కాదని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మహేష్‌బాబుతో పాటు ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కూడా నటిస్తున్నాడు కనుక ఆయనకు జోడీగా ఈ చిత్రంలో ఈమె నటిస్తుందేమో అంటూ ప్రచారం జరుగుతుంది. పల్లెటూరు రైతు పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నాడు.


Meenakshi Dixit In Mahesh Babu Movie-Maharshi Movie Rishi

ఆ రైతు భార్య పాత్రలోనే మీనాక్షీ దీక్షిత్‌ కనిపించబోతుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు అదృష్టి కలిసి రాకపోవడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

Meenakshi Dixit In Mahesh Babu Movie-Maharshi Movie Rishi

తెలుగులో చాలా కాలం తర్వాత వచ్చిన ఈ ఆఫర్‌తో మరోసారి తాకు తాను నిరూపించుకుంటుందా చూడాలి. మహేష్‌కు జోడీగా కాకున్నా కూడా మహేష్‌ సినిమాలో అంటే భారీ ఎత్తున క్రేజ్‌ ఉండే అవకాశం ఉంది. మంచి పాత్ర మీనాక్షీకి పడితే తప్పకుండా ఆమె మళ్లీ హీరోయిన్‌గా బిజీ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మరి మీనాక్షీకి అంత అదృష్టం ఉందా అనేది చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.