అలాంటి పాత్రల్లో నటిస్తానన్న మీనా.. అవాక్కైన ఫ్యాన్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మీనా నటిగా ఒక వెలుగు వెలిగారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మీనా నటిస్తున్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతున్నాయి.

 Meena Want To Play The Role Of Villain Shades-TeluguStop.com

అయితే మీనా తాజాగా చేసిన కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిందని మీనా అన్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్లోని పాత్రలను పాత్రల్లానే చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.అందువల్ల వైవిధ్యంతో ఉన్న, విలక్షణతో కూడిన పాత్రలలో నటించడానికి తాను ఆసక్తి చూపుతున్నానని మీనా తెలిపారు.

 Meena Want To Play The Role Of Villain Shades-అలాంటి పాత్రల్లో నటిస్తానన్న మీనా.. అవాక్కైన ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు విలన్ రోల్స్ లో నటించాలని ఉందని మీనా చెప్పుకొచ్చారు.సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తున్న మీనా విలన్ రోల్స్ లో నటించాలని ఉందని చేసిన కామెంట్లు విని అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.

విలన్ రోల్స్ మీనాకు సూట్ కావని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రాబోయే రోజుల్లో మీనా నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా బిజీగా ఉన్నారు.తెలుగులో మీనా నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.

ప్రస్తుతం మీనా ప్రయోగాత్మక కథలపై దృష్టి పెట్టడం గమనార్హం.

Telugu Meena, Romantic Comedy Movies, Villain Shades, Want To Play-Movie

గతంలో కొన్ని పాత్రలలో నటించడానికి ఇమేజ్ గురించి ఆలోచించాల్సి వచ్చేదని ప్రస్తుతం ఇమేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మీనా అన్నారు.తెలుగులో తనకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించిందని కొందరు ఫ్యాన్స్ తనకు రక్తంతో లేఖలు రాశారని ఆమె తెలిపారు. రొమాంటిక్ కామెడీ సినిమాలను తాను ఎక్కువగా ఇష్టపడతానని మీనా పేర్కొన్నారు.

సున్నిత భావోద్వేగాలు ఉన్న కథలను కూడా తాను ఎక్కువగా ఇష్టపడతానని మీనా వెల్లడించడం గమనార్హం.

#Meena #Villain Shades #RomanticComedy #Want To Play

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు