భర్త చనిపోగానే అలాంటి నిర్ణయం తీసుకున్న మీనా..?

సీనియర్ నటి మీనా గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Meena Took Such A Decision After Her Husband Died , Meena, Tollywood, Husband Di-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఆమె లైఫ్ అంతా బాగుంది అనుకునే లోపు తన భర్త మరణ వార్త తనని అయోమయ స్థితిలోకి పడేసింది.అయితే తన భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.

తన భర్త చనిపోగానే మీనా తన కెరియర్ గురించి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

ఇన్ని రోజులు తన భర్త తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ తనని సినిమాలలో నటించమని ప్రోత్సహించారు.

అయితే ప్రస్తుతం తన భర్త మృతి చెందడంతో తాను సినిమాలతో బిజీ అయితే తన కూతురు భవిష్యత్ అంధకారంలోకి పడుతుందని, ఉన్న జీవితం తన కూతురితో గడుపుతూ తన కూతురికి తండ్రి లేడు అనే లోటూ తెలియకుండా పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టూ తెలుస్తుంది.అందుకే ప్రస్తుతం తాను సినిమా షూటింగులను పూర్తి చేసి తదుపరి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా తన కూతురి కోసం గడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Meena, Telugu, Tollywood, Vidyasagar-Movie

ఇలా మీనా తన కూతురి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎంతోమంది ఈమె నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.మరికొందరు మాత్రం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన భర్త లేరన్న వార్త నుంచి బయటపడతారని, సినిమాలలో నటించడమే మంచిది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.అయితే మీనా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube