అక్కడ కూడా మీనానే దిక్కా.. కమల్‌ పంథం వీడట్లేదు

మలయాళంలో ఏడు ఏళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా అప్పట్లో సూపర్ హిట్ దక్కించుకుంది.తెలుగు మరియు తమిళంలో కూడా రీమేక్‌ అయ్యింది.

 Meena Only Choice To Tamil Drushyam 2 Movie-TeluguStop.com

మలయాళంలో మోహన్ లాల్‌ మరియు మీనాలు నటించగా తెలుగు లో వెంకటేష్ మరియు మీనాలు నటించారు.తమిళంలో మాత్రం కమల్‌ మరియు గౌతమిలు నటించారు.

దృశ్యం కు సీక్వెల్‌ తెరకెక్కింది.ఇప్పటికే మలయాళంలో వచ్చిన దృశ్యం 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

 Meena Only Choice To Tamil Drushyam 2 Movie-అక్కడ కూడా మీనానే దిక్కా.. కమల్‌ పంథం వీడట్లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ అంచనాల రూపొందిన దృశ్యం 2 అంచనాలకు తగ్గట్లుగా సినిమా ను జీతూ జోసెఫ్‌ సక్సెస్ దక్కించుకున్నాడు.దృశ్యం 2 లో కూడా మోహన్ లాల్‌ మరియు మీనా నే జంటగా నటించిన విషయం తెల్సిందే.

ఇక తెలుగు దృశ్యం 2 కూడా రూపొందుతుంది.తెలుగులో వెంకీకి మొదటి పార్ట్‌ లో మీనా నటించినట్లుగానే తెలుగు సీక్వెల్‌ లో కూడా మీనా నే నటిస్తున్న విషయం తెల్సిందే.

తమిళంలో ఈ సినిమా ను రీమేక్ చేసేందుకు జీతూ జోసెష్‌ చాలా ఇంట్రెస్ట్‌ తో ఉన్నాడు.త్వరలోనే ఈ సినిమా ను పట్టాలెక్కించాలని ఆయన భావిస్తున్నాడు.తెలుగు దృశ్యం 2 పూర్తి చేసిన జీతూ జోసెఫ్‌ తమిళం పనులు మొదలు పెట్టాలనుకున్న సమయంలో ఆయనకు అనుకోని సమస్య వచ్చి పడింది.తమిళ దృశ్యం లో కమల్‌ హాసన్‌ కు జోడీ గా గౌతమి నటించిన విషయం తెల్సిందే.

ఆ సమయంలో వారిద్దరు సహ జీవనంలో ఉన్నారు.కాని ఇప్పుడు ఇద్దరు విడిపోయారు.

Telugu Director Jeetu Joseph, Drushyam Movie, Drushyam Movie Sequel, Film News, Gouthami, Kamal And Gowthami, Kamal Hassan, Meena, Mohan Lal, Movie News, Tamil Drushyam 2, Venkatesh-Movie

కనుక కలిసి నటించడం అనేది సాధ్యం అయ్యే పని కాదు.కనుక వారిద్దరి స్థానంలో మరెవ్వరిని అయినా తీసుకోవాలా అని దర్శకుడు భావిస్తున్నాడు.కాని కమల్‌ అయితేనే బాగుంటుందని.ఆయనకు జోడీగా గౌతమి నటిస్తేనే ఫీల్‌ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నారు.కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కమల్‌ ఆమె తో కలిసి నటించక పోవచ్చు అంటున్నారు.దాంతో సినిమా కనుక చేస్తే కమల్‌ కు జోడీగా మీనా నే నటింపజేసే అవకాశం ఉందంటున్నారు.

హీరోయిన్ విషయంలో నిర్ణయం జరుగుతుంది.

#Venkatesh #DrushyamMovie #Kamal Hassan #MOhan Lal #Meena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు