'మీకు మాత్రమే చెప్తా' స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్

విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌గా దూసుకు పోతున్నాడు.పలువురు నిర్మాతలు ఈయనతో సినిమాను చేసేందుకు ముందుకు వస్తున్నారు.

 Meeku Matrame Chepta Movie Review And Rating-TeluguStop.com

అలాంటి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించాడు.చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పెద్ద బిజినెస్‌ చేసిందని వార్తలు వస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడంతో మంచి హైప్‌ అయితే వచ్చింది.సినిమా ట్రైలర్‌ కూడా విభిన్నంగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందనిపించేలా ఉంది.

అందుకే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :


ఈమద్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్‌ అవి కూడ స్మార్ట్‌ ఫోన్స్‌.తప్పు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండకుంటే ఎవడు ఎక్కడ స్మార్ట్‌ ఫోన్‌ పెట్టి వీడియో తీస్తాడో.

ఈ సినిమాలో తరుణ్‌ భాస్కర్‌ కూడా ఒకనొక బలహీన క్షణంలో ఉన్న సమయంలో వీడియో షూట్‌ అవుతుంది.ఆ వీడియోతో అతడి జీవితమే మలుపు తిరుగుతుంది.పెళ్లి కావాల్సిన హీరో తన స్నేహితుడితో కలిసి ఆ వీడియోను ఎలా కనిపెడతాడు, అది అసలు ఎవరు తీశారు, ఆ వీడియోలో ఏముంది అనే విషయాలను ఈ చిత్రం చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :


Telugu Meekumatrame, Reviews, Tarun Bhaskar, Tollywood Box-

దర్శకుడు అయిన తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రంతో హీరోగా మారాడు.హీరో అనడం కంటే ఒక మంచి నటుడిగా తరుణ్‌ ఆకట్టుకున్నాడు.కమర్షియల్‌ హీరోల మాదిరిగా ఫైట్స్‌.

చేజ్‌లు ఇలా అవేమీ లేకుండా సింపుల్‌గా చాలా సహజంగా నటించేశాడు.పెళ్లి చూపులు సినిమాలో విజయ్‌ దేవరకొండ నటన ఎలా ఉంటుందో అంత సహజంగా తరుణ్‌ భాస్కర్‌ నటించి మెప్పించాడు.

కొన్ని సన్నివేశాల్లో తరుణ్‌ డైరెక్టర్‌ కంటే నటుడిగానే సక్సెస్‌ అవుతాడు అనిపించేలా నటించాడు.ఇక అభినవ్‌ గౌతమ్‌ కూడా తరుణ్‌ భాస్కర్‌ కు మంచి సపోర్టింగ్‌ ఇచ్చి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.

తనదైన శైలి హావబావాలు మరియు కామెడీ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించాడు.మొత్తంగా వీరిద్దరి కాంబో సీన్స్‌కు మంచి మార్కులు వేయవచ్చు.

అనసూయకు చిన్న పాత్ర దక్కింది.ఉన్నంతలో ఆమె పర్వాలేదు అనిపించింది.

ఇక హీరోయిన్స్‌ కూడా ఆకట్టుకున్నారు.సినిమాలోని ప్రతి ఒక్కరితో ది బెస్ట్‌ యాక్టింగ్‌ను రాబట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

టెక్నికల్‌ :


శివ కుమార్‌ సంగీతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొన్ని సన్నివేశాల్లో చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ బాగుంది.సీన్స్‌ నాచురల్‌గా రావడంలో సినిమాటోగ్రఫీ చాలా కీలకంగా వ్యవహరించింది.

ఇక దర్శకుడు షామీర్‌ సుల్తాన్‌ సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌ గా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.స్క్రీన్‌ప్లేను చాలా స్మూత్‌గా సాగిస్తూ ఒక మంచి ఫీల్‌ తో ముందుకు తీసుకు వెళ్లాడు.

సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ టెన్షన్‌తో కామెడీ పుట్టించాడు.ఇక విజయ్‌ దేవరకొండ ఈ సినిమాకు కావాల్సినంత డబ్బు పెట్టాడు.కథానుసారంగా నిర్మాణాత్మక విలువలు ఉన్నాయి.

విశ్లేషణ :


కొత్త దర్శకుడు.కొత్త నిర్మాత, కొత్త హీరో, కొత్త డీఓపీ ఇలా చాలా మంది కొత్త వారు ఈ సినిమాను చేశారు.ప్రీ రిలీజ్‌ సమయంలోనే విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ కొత్త వాళ్లం కలిసి చేశాం.

దీన్ని మీరు ఆధరించాలని కోరాడు.కొత్త వారే చేసినా ఇది ఒక రెగ్యులర్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలో కాకుండా విభిన్నమైన కామెడీ సీన్స్‌తో సినిమా సాగింది.

ఈ చిత్రం కథను విజయ్‌ దేవరకొండ నమ్మాడు.అందుకే ఈ సినిమాను సొంతం గా నిర్మించాడు.

తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందని అనుకున్నాడు.దర్శకుడు షామీర్‌కు పూర్తి స్వేచ్చ ఇచ్చాడు.

తెలుగు రాకున్నా కూడా షామీర్‌ ఈ సినిమాలో కామెడీతో మెప్పించాడు.ఇక మొత్తానికి దర్శకుడు షామీర్‌ తనపై విజయ్‌ పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టుకున్నాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :


తరుణ్‌ భాస్కర్‌,
కామెడీ సీన్స్‌

మైనస్‌ :


సంగీతం లేకపోవడం,
లీడ్‌ పెయిర్‌ మద్య రొమాన్స్‌ మిస్‌ అయ్యింది,
కొన్ని సీన్స్‌ కన్ఫ్యూజింగ్‌గా ఉన్నాయి.

బోటమ్‌ లైన్‌ :


మీకు మాత్రమే చెప్తా అని అందరిని మెప్పించారే

రేటింగ్‌ : 2.75/5.0


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube