'మీకు మాత్రమే చెప్తా' బిజినెస్‌ పరిస్థితి ఏంటీ?

విజయ్‌ దేవరకొండ హీరోగా సూపర్‌ హిట్‌ అయ్యాడు.ఈయనకు స్టార్‌డం దక్కింది.

 Meeku Matrame Chebutha Prebusiness-TeluguStop.com

స్టార్‌ స్టేటస్‌ దక్కిన వారు సైడ్‌ బిజినెస్‌లు చేయడం ఈమద్య కాలంలో చాలా కామన్‌ అయ్యింది.అలాగే విజయ్‌ దేవరకొండ కూడా నిర్మాతగా మారాడు.

మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక సినిమాను నిర్మించాడు.నేడు విడుదల అయిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో విజయ్‌ దేవరకొండ చాలా సంపాదించాడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేవలం అయిదు కోట్ల బడ్జెట్‌తోనే సినిమాను విజయ్‌ దేవరకొండ నిర్మించాడు.తాను ఇప్పటి వరకు సంపాదించింది అంతా కూడా ఈ సినిమాలో పెట్టానని విజయ్‌ దేవరకొండ అన్నాడు.

కాని అది ఏమాత్రం నిజం కాదని కేవలం అయిదు కోట్లు మాత్రమే ఈ సినిమా కోసం ఆయన వ్యచ్చించాడు అంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక అయిదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపుగా 15 కోట్ల వరకు బిజినెస్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Meekumatrame-

విజయ్‌ దేవరకొండ పేరు ఉండటంతో మీకు మాత్రమే చెప్తా సినిమాకు మంచి బిజినెస్‌ అయ్యింది.ఆ సినిమా కాస్త భారీ పబ్లిసిటీ తెచ్చుకుంది.అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్‌ చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ విషయంలో కూడా మీకు మాత్రమే చెప్తా నిర్మాత విజయ్‌ దేవరకొండకు లాభాలను తెచ్చి పెట్టింది అంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.సినిమా కాస్త పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా విజయ్‌ దేవరకొండకు ఇప్పటికే వచ్చిన 10 కోట్లకు అదనంగా మరో 10 కోట్ల లాభం అంటే మొత్తం 20 కోట్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube