నిజామా? ఆవు మూత్రం, పేడతో ‘కరోనా వైరస్’కు చెక్ పెట్టొచ్చా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ ప్రజలను వణికించేస్తోంది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ప్రాణాలను మింగేసిన కరోనా వైరాస్ దాదాపు 10 వేల మందికి పైగా ప్రజల సోకింది.

 Medisin Wih Cow Manure Carona-TeluguStop.com

తాజాగా కేరళలో మరొకరికి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం.అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు గజ గజ వణికిపోతున్నారు.

అలాంటి ఈ సమయంలో కరోనా వైరస్ ను ఎలా ఆపాలి అని వైద్యులు.శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.అటువంటి ఈ సమయంలో ఈ వైరస్‌ను నివారించే శక్తి కేవలం ఒక్క ఆవు మూత్రానికి మాత్రమే ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది.ఒకరకంగా ఈ ప్రచారానికి మూలా కారకుడు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అనే చెప్పచు.

స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.స్వామి చక్రపాణి కరోనా వైరస్ అంతం గురించి మాట్లాడుతూ.”గోమూత్రం, పేడతో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.శరీరానికి ఆవు పేడ రాసుకుని ఓం నమః శివాయ అని దేవుడిని స్మరిస్తారో వారు ఈ ఇన్ఫెక్షన్ నుంచి సురక్షితంగా ఉంటారు.

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు త్వరలో ప్రత్యేక యాగం నిర్వహించనున్నాం” అని అయన తెలిపారు.

అయితే అయన చెప్పిన దానిపై ఎటువంటి ఎలాంటి పరిశోధనలు జరగలేదు.

ఆయుష్ మంత్రిత్వ శాఖనే ఆ వైరస్ ని ”యునానీ, హోమియోపతి వైద్యంతో కరోనావైరస్‌ నివారణకు అవకాశాలు ఉన్నాయి అని.త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలని, శుభ్రంగా ఉండాలని సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.అలాంటిది చక్రపాణి చెప్పిన ఆవుపేడ, ఆవు మూత్రంపై ఎటువంటి పరిశోధనలు జరగలేదు.కాబట్టి ఇలాంటివి నమ్మకపోవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube