సూదిమంది వికటించి 44 మందికి అస్వస్థత

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు సూదిమందు ఇవ్వగా అది వికటించడంతో ఏకంగా 44 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.సర్వజన ఆసుపత్రిలోని పురుషుల జనరల్ వార్డులో 44 మంది రోగులకు ఈ సూదిమందు ఇచ్చారు వైద్య సిబ్బంది.

 Medicine Distorted In Ananthapuram-TeluguStop.com

ఈ క్రమంలో సెఫ్ట్రాక్సిన్ అనే యాంటిబయోటిక్ మందు వికటించిందని వారు తెలిపారు.

సూది మందు వికటించడంతో 44 మంది రోగులకు వెంటనే దద్దుర్లు పుట్టడం, శరీరంపై మంట ఏర్పడటం, వాంతులు, చలిజ్వరంతో రోగులు నానా అవస్థలు పడ్డారు.

చికిత్స కోసం వచ్చిన తమకు కొత్త రోగాలను తెప్పించారని వైద్య సిబ్బందిపై రోగుల బంధువులు మండిపడ్డారు.కాగా షిఫ్టులు మారే సమయం కావడంతో వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని, చాలాసేపటి తరువాత వైద్యులు వచ్చారు.

వారు వెంటనే రోగులకు విరుగుడు మందు ఇచ్చారు.

ఆసుపత్రి ఇంచార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ అక్కడికి చేరుకుని రోగులకు, వారి బంధువులకు ధైర్యం చెప్పారు.

ఎవ్వరికీ ఏం జరగకుండా చూస్తామని వారు హామి ఇచ్చారు.ఈ ఘటనతో ఆసుపత్రి ఆవరణ ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube