ఓ చేతిలో మెడిసిన్ డబ్బా, వీపుకి బిడ్డను కట్టుకుని నది దాటుతూ మహిళ హెల్త్ అసిస్టెంట్..?!

సాధారణంగా కొంత మందికి ప్రభుత్వ ఉద్యోగులు అన్నా కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొంతమందిన్నా చాలా చిన్న చూపు చూస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందుకు ముఖ్య కారణం కూడా లేకపోలేదు.

 Medicine Can In One Hand A Woman Carrying A Baby On Her Back Crossing The River Health Woman Assistant-TeluguStop.com

ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు కొంత మంది బాధ్యత లేకుండా వెవహరించడం అనేది నిదర్శనం అంతేకాకుండా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత కలిగిన వారు కూడా ఉన్నారు.ఇదే విషయం చాలా సార్లు రుజువైన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.

ఇందుకు గల చక్కటి నిదర్శనం కొండకోనల్లో చదువు నేర్పించడానికి వెళ్లే ఉపాధ్యాయులు, అలాగే ఉత్తరాలు డెలివరీ చేసే పోస్ట్ మాన్, హెల్త్ వర్కర్స్ కూడా ఈ జాబితాలోనే చేరుతారు.వారు ఎన్ని కష్టాలు పడిన సరే ప్రజల సేవ మాత్రం చేయకుండా మానరన్న సంఘటనను తాజాగా జార్ఖండ్ కు చెందిన ఒక హెల్త్ అసిస్టెంట్ చేసిన పనే అనే చెప్పాలి.

 Medicine Can In One Hand A Woman Carrying A Baby On Her Back Crossing The River Health Woman Assistant-ఓ చేతిలో మెడిసిన్ డబ్బా, వీపుకి బిడ్డను కట్టుకుని నది దాటుతూ మహిళ హెల్త్ అసిస్టెంట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే జార్ఖండ్ కు చెందిన మంత్రి కుమారి అనే ఒక హెల్త్ అసిస్టెంట్ రోజు గ్రామాలకు వెళ్లి చిన్నారులకు టీకాలు అందజేస్తుంది ఆమెకు ఒక కుమార్తె ఉంది.అయితే విధుల నిర్వహణలో భాగంగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఆ హెల్త్ అసిస్టెంట్ ప్రతి రోజు కూడా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ప్రతిరోజు దూర ప్రయాణం చేయడం కారణం చేత తన కూతురిని ఇంట్లో వదిలి వెళ్లడం వల్ల ప్రమాదం కనుక రోజు తనతోపాటే విధులకు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంది.ఈ క్రమంలో హెల్త్ అసిస్టెంట్ గ్రామాలకు రోజు వ్యాక్సినేషన్ చేయడానికి వెళ్తున్న తరుణంలో తన కుమార్తెను వీపుకు కట్టుకొని దారిలో ఉండే నదిని దాటుకొని వెళ్ళి తన బాధ్యతను నిర్వహించేందుకు ముందడుగు వేసింది.

ఇలా సాహసం చేయడంతో ప్రజలు అందరూ కూడా కుమారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలో హెల్త్ అసిస్టెంట్ అయినా కుమారి నది దాటుతూ ఉండగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

#Daughter #Vaccine #Container #Crossing #River

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు