'వైధ్యో'..నారాయణొ..'హరి'!!  

Medical Seat Cost 2 Crores-

వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైధ్యం చేయించుకోవడం ఎంత కాస్ట్లీనో..

Medical Seat Cost 2 Crores---

అదే క్రమంలో ఆదే వైధ్యం చదువుకోవడం సైతం అంటే కొస్ట్లీ.ఇక విషయంలోకి వెళితే…రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లోని పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల ఫీజు ఆకాశాన్ని తాకింది.వేలు.కాదు.లక్షలు కాదు.

సాక్షాత్తూ కోట్లు.అదే రెండు కోట్లు.ప్రసుత్తం ఏడు ప్రభుత్వ, మరో 7 ప్రైవేటు వైద్యకళాశాలల్లో పిజి సీట్లు విద్యా ర్ధులకు అందుబాటులో ఉన్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఈ ఫీజులు కేవంల రూ.

60 లక్షల నుండి కోటి రూపాయల వరకూ వసూలు చేసేవారని ప్రచారం.అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల లోని వైద్యకళాశాలల్లో పిజి సీట్ల ధరలను రెట్టింపు చేసి, వసూళ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో పిజి సీట్లు 1100, ప్రైవేటు కళాశాలల్లో 850 సీట్లు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ ఫీజు విషయంలో ఎలాంటి తగ్గింపు లేదని ముందే అభ్యర్ధులకు తేల్చిచెప్పడం, రూ.2 కోట్లు చెల్లిస్తేనే సీటు ఖాయమని యాజమాన్యాలు చెప్పడంతో తప్పని సరి పరిస్థితుల్లో చెల్లించాల్సి వస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.ప్రభుత్వ వైద్యకళాశాలల్లో మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపులు జరుగుతాయని చెబుతున్నప్పటికీ, మెరిట్‌ మార్కులు సాధించడానికి కూడా పలు మార్గాలను అభ్యర్థులు ఎంచుకుంటు న్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ అంశాలను రాష్ట్ర వైద్యవిద్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కాంతారావు తోసిపుచ్చారు.ఏది ఏమైనా మెడిసిన్ చదువు అనేది సామాన్యుడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి.