ఆ మెడికల్ కాలేజీ యాజమాన్యం కఠిన నిర్ణయం.. దోపిడికి దారులు తెరచింది.. ?

ప్రభుత్వాలు ఉన్నవి ప్రజల కష్టాలు పట్టించుకోవడానికి.జనం అన్యాయం అయిపోతుంటే చూడటానికి కాదు.

 Medical College Ownership Tough Decision, Khyber Medical College, Peshavar, Paki-TeluguStop.com

కానీ నేటి ప్రభుత్వాలే ప్రజలను దోచుకుంటుంటే ప్రజలకు ఎవరు దిక్కు.

ఇక పాకిస్దాన్‌లో అయితే జనం గోస చెప్పడానికి వీలుకానంతగా ఉంది.

ఎందుకంటే పాకిస్థాన్‌లోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన షాక్ అలాంటిది.పలు కేసుల్లో బాధితులకు అండగా ఉండాల్సిన ఫోరెన్సిక్ విభాగం వైద్యులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

అదేంటో తెలుసుకుంటే.

ఈ నెల 14న పెషావర్ జిల్లాకు చెందిన ఖైబర్ మెడికల్ కాలేజీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగిందట.

ఆ సమావేశంలో ఆ కాలేజీకి చెందిన ఫోరెన్సిక్ విభాగం అధికారులు మొత్తం 17 రకాల వైద్యపరీక్షలకు రుసుములను ఖరారు చేశారు.అవి ఎలా ఉన్నాయంటే.అత్యాచారం కేసులో వైద్యపరీక్షల కోసం వచ్చే బాధితురాళ్లు రూ.25 వేలు చెల్లించాల్సిందేనట.

ఇక పెషావర్ మినహా ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారికి పోస్టుమార్టం చార్జీలను రూ.25 వేలుగా, జిల్లా పరిధిలోని స్థానికులకు మాత్రం రూ.5 వేలుగా ఖరారు చేసింది.ఇక డీఎన్ఏ పరీక్షలకు రూ.18 వేలు, డ్రగ్స్ టెస్టుకు రూ.3 వేలు, మద్యం తాగారని నిర్దారించడానికి రూ.2 వేలు, పైజన్ తీసుకున్న వారికి రూ.4 వేలు, మృతదేహాలను ఫీజర్‌లతో భద్రపరిస్తే ప్రతి 24 గంటలకు రూ.1500 చొప్పున చార్జీలు వడ్డించాలని నిర్ణయించిందట.ఇదెక్కడి దారుణం అని పాకిస్దాన్‌లో ఈ మెడికల్ కాలేజీ యాజమాన్యం నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube