ఆ కాపీ రొంపిలోకి మెగాస్టార్ ని లాగే ప్రయత్నం చేస్తున్న మీడియా

ప్రస్తుతం టాలీవుడ్ లో కొరటాల, మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మూవీపై కాపీ వివాదం నడుస్తుంది.ఈ సినిమా కథ తనదే అంటూ రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేస్తూ మీడియా ముందుకి వచ్చాడు.

 Media Target On Chiranjeevi In Acharya Movie Copy Allegations, Koratala Shiva, M-TeluguStop.com

అయితే ఈ సినిమా కథ కొరటాల సొంత కథ అని, దీనిపై వస్తున్న కాపీ ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక తాను మైత్రీ మూవీ నిర్మాతలకి తన కథని చెప్పడం జరిగిందని, వారు అప్పుడే కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తీద్దామని నాతో చెప్పడం జరిగిందని, అయితే దానికి అంగీకరించకుండా నేను వచ్చేసినట్లు చెబుతున్నాడు.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారి వెర్షన్ వేరుగా ఉంది.ఆ కథ తమకి నచ్చకపోవడంతో రిజక్ట్ చేయడం జరిగిందని తేల్చేశారు.

అయితే ఈ సినిమాపై మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంది.

గతంలో చాలా సినిమాలకి ఇలాంటి వివాదాలు వచ్చాయి.

చాలా మంది రచయితలు కూడా పలానా సినిమా కథ తమదే అంటూ హడావిడి చేశారు.అయితే అప్పట్లో ఆ అంశాలని పెద్దగా ఫోకస్ చేయని మీడియా ఇప్పుడు ఆచార్య సినిమాపై రచ్చ చేస్తున్నాయి.

అయితే ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగే ప్రయత్నం చేయడం గమనార్హం.ఎవరో వచ్చి ఒక నిర్మాతకి కథ చెబితే ఆ కథని కొరటాల కాపీ చేస్తే విమర్శలు చేయాల్సింది సదరు నిర్మాత, దర్శకుల మీద కానీ ఒక వర్గం మీడియా మాత్రం దీనిలోకి చిరంజీవిని లాగుతూ అతను ఈ వివాదంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే కథను కాపీ చేయడానికి చిరంజీవికి అసలు సంబంధం లేకపోయినా కూడా అతనిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ ఇష్యూని పెద్దది చేసి ఇండస్ట్రీకి ఇప్పుడు చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఆయనే ఈ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేయడం.దానిని మీడియా అదే పనిగా హైలెట్ చేసి చూపించడం అంతా చిరంజీవి ఇమేజ్ దెబ్బ తీయడానికే అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube