మీడియా వాళ్ళు 'చిన్మయి'ని ఎలాంటి ప్రశ్నలతో హింసించారో తెలుసా.? అండగా ఉంటారనుకుంటే.!  

 • చిన్మయి…మంచి సింగర్ కంటే సమంత కి వాయిస్ ఇచ్చిన సింగర్ అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. ‘ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పి సమంత కి కుర్రకారులు ఫ్లాట్ అవ్వడానికి పరోక్షంగా కారణంగా మారింది చిన్మయి. తర్వాత హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లిచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండవుతున్న #MeToo‌లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్న విషయం అందరికి తెలిసిందే. మన దగ్గర శ్రీరెడ్డి లాగా అక్కడ చిన్మయి అందరి భాగోతాన్ని బయటపెడుతోంది.

 • Media Irritates Singer Chinmayi With Questions-

  Media Irritates Singer Chinmayi With Questions

 • ఈ నేపధ్యంలో రీసెంట్ గా చిన్మయి తనలా లైంగిక వేధింపులకు గురైన మరికొంతమంది సిని,టీవి ఇండస్ట్రీకి చెందిన మహిళలతో మీడియా సమావేశం నిర్వహించటం జరిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉమెన్స్ అశోశియోషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీట్ లో …. లీనా మణి మేఖలై, చిన్మయి శ్రీపాద, శ్రీరంజని, లక్ష్మి రామకృష్ణన్ మాట్లాడి, తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి వచ్చారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రెస్ మీట్ …వేధింపుల మీట్ లా తయారైంది. సానుభూతి చూపి అండగా ఉండాల్సిన మీడియా మాటలతో దాడి చేసింది.

 • అక్కడకి వచ్చిన మీడియా రిపోర్టర్స్ చాలా దారుణంగా ప్రశ్నలతో వారిని మాట్లాడనివ్వకుండా చేసే ప్రయత్నం చేసారు. ఇది ఊహించని సంఘటన. అక్కడకి వచ్చిన చాలా మంది మగ జర్నలిస్ట్ లు ఈ బాధిత మహిళలపై ప్రశ్నలతో దాడి చేసారు. తాము రాజకీయనాయకులం, రేపిస్ట్ లమో, బ్యూరోకార్ట్స్ మో కాదని,కేవలం లైంగిక వేధింపులకు గురైన మహిళలమని వారు ఆ మహిళలు మొత్తుకోవాల్సి వచ్చింది. చివరికి చిన్మయి చేతులు జోడించి…కాస్త సున్నితంగా మాట్లాడండి, మీరు అలా మాట్లాడటం ఆపండిప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది.

 • మేము వేధింపులకు సంభందించిన మా జీవిత విషయాలు మాట్లాడటానికి ఇక్కడకి వచ్చాం అంతేతప్ప ఈ దేశంలో ఉన్న మగవాళ్లందరినీ కించపరిచేందుకు కాదు. దయచేసి ఈ విషయంలో మగవాళ్లను మాకు అండగా నిలబడమని కోరుతున్నాం. ఇప్పటికే మా మీద చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఏకంగా ఇక ఆపండిచాలు అంటున్నారు అని ఆమె ఆవేదనగా అన్నారు.

 • Media Irritates Singer Chinmayi With Questions-
 • “మీరు ఇదంతా సోషల్ మీడియాలో పెట్టేముందు విశాఖ కమిటీ ను ఎందుకు పిర్యాదు చేయలేదు ?” అని కొందరు సూటిగా అడిగారు. అయితే అసలు అలాంటి కమిటీ లేదని సమాధానమొచ్చింది.

 • ఇక చిన్మయిని అయితే “వైరముత్తు అలాంటివాడు అనుకున్నప్పుడు ఆయన్ని మీ పెళ్లికి ఎందుకు ఆహ్వానించారు?”

 • “ఆయన పాదాలపై పడి ఎందుకు ఆశీర్వాదం తీసుకున్నారు?”

 • “ఈ ఆరోపణల వెనుక పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా?”

 • అయితే ఇలా మీడియా వ్యక్తులు మాట్లాడతారని ఊహించని భాథిత మహిళలుకోపం తెచ్చుకున్నాదాన్ని అణుచుకుని అలా మాట్లాడవద్దని రిక్వెస్ట్ చేసారు. అయినా మీరు ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు ఫిర్యాదు చేయటం ఏమిటి అనే ప్రశ్నను వేయటం మాత్రం మీడియా అడగటం మానలేదు.