కరోనాతో కాదు మీడియాతోనే  ప్రమాదకరం ? 

ఏ ఛానల్ చూసినా,  ఈ పేపర్ చూసిన కరోనా కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.కరోనా తీవ్రత పెంచి చూపిస్తూ హడావుడి చేస్తున్నాయి.

 Media Frightening The People With Corona News , Bharat, Corona , Corona Second W-TeluguStop.com

అసలు దేశంలో కరోనా తీవ్రత కంటే,  మీడియాలో చూపిస్తున్న తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాల్లో భయాందోళనలు  పెరిగిపోతున్నాయి.వాస్తవ పరిస్థితి కంటే తీవ్రమైన పరిస్థితులు ఉన్నట్లుగా మీడియా కథనాలు ఉండడంతో,  నిజంగానే దేశంలో ఏదో అల్లకల్లోలం జరిగిపోతుందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది.

ఇది ఒక మానసిక రుగ్మత గా మారిపోయింది.కరోనా వస్తే దానిని ఎదుర్కొని, మందులతో దానిని తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్న వారు సైతం మానసిక భయంతో అర్ధాంతరంగా మరణిస్తున్న సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి .దీనంతటికీ కారణం జనాల్లో మానసికంగా పెరిగిపోతున్న భయమే.

అవును ఈ కరోనా విషయంలో మీడియా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు గానే కనిపిస్తోంది.

దేశమంతా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతున్నట్లు , ప్రపంచ వినాశనం భారత్ నుంచి మొదలైనట్లుగా మీడియా కథనాలు ఉండడంతో , ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.ఇప్పటికే భారత్ కు కొన్ని దేశాలు రాకపోకల పై నిషేధం విధించాయి.

భారత్ లో పరిస్థితి పై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  భారత్ కారణంగా తమకు ఎక్కడ ఇబ్బంది వచ్చి పడుతుందో అనే టెన్షన్  ఎక్కువగా కనిపిస్తోంది.

దీనంతటికీ కారణం వాస్తవ పరిస్థితి కంటే ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు మీడియాలో వస్తున్న కథనాలే కారణం.ఇక కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

కానీ, మీడియాలో వస్తున్న కథనాలు చూసి ముందుగానే ఆస్పత్రులలో చేరిపోతున్నారు.

Telugu Bharat, Corona, Corona Bed, Corona China, Corona Wave, Covid, Electronic,

మరికొంతమంది ఆసుపత్రులలో ముందస్తుగానే బెడ్ రిజర్వు చేసుకుంటున్నారనే రిపోర్టులు వస్తున్నాయి.అసలు ఈ పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.కరోనా  వచ్చినా, దాని తీవ్రతను తగ్గించేందుకు , దాని నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలను మీడియా ఎక్కువగా ప్రచారం చేయాలి.

కరోనా ప్రభావానికి గురైన వారిలో మానసిక ఆందోళన తగ్గించే విధంగా కథనాలు ప్రచారం చేసి , ఈ క్లిష్ట సమయంలో మీడియా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి.ప్రస్తుతం కరోనా పై మీడియా చేస్తున్న హడావుడి కి ఒంట్లో వచ్చిన సాధారణ నీరసానికి, చిన్న చిన్న జబ్బులను కూడా ఇప్పుడు కరోనా గా భావించి ఆందోళన పడే పరిస్థితి కి జనాలు వచ్చేసారు .దీనంతటికీ పరోక్షంగా అన్ని మీడియా లు కారణమే.ఇక సోషల్ మీడియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు గా ఇక్కడ ప్రతీది సెన్సేషన్ న్యూసే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube