తెలుగు అమ్మాయి అంజలి ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత మీడియాలో ఉంటూ వస్తుంది.తాజాగా ఆ మీడియాను ఈమె తన ఆలస్యంతో ఇబ్బంది పెట్టింది.
అంజలి నటించిన ‘చిత్రాంగద’ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.మీడియా సమావేశం చెప్పిన సమయంకు ప్రారంభం అవుతుందని భావించిన ప్రెస్ మిత్రులు అంతా కూడా ఆ సమయంకు అక్కడకు చేరుకున్నారు.
మీడియా వారు అక్కడకు చేరుకున్న దాదాపు రెండు గంటలకు కాని అంజలి అక్కడకు రాలేదు.
అంజలి కోసం అంత సమయం ఎదురు చూసిన మీడియా వారు ఆమెపై ఆగ్రహంను వ్యక్తం చేశారు.
నిర్మాత మరియు దర్శకుడి రిక్వెస్ట్ మేరకు ఆమె వచ్చే వరకు ఎదురు చూసి, ప్రెస్‌మీట్‌ను కవర్ చేశారు.లేట్‌గా వచ్చిన అంజలి సింపుల్‌గా సారీ అంటూ చెప్పి తాను చేసిన తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేసింది.
కాని మీడియా వారు మాత్రం ఆమెపై తీవ్ర కోపం ఉన్నా ఏమనలేక పోయారు.ఇక ‘చిత్రాంగద’ విషయానికి వస్తే హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని అశోక్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించారు.
ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.సినిమా మరో ‘గీతాంజలి’లా ఉంటుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ సభ్యులు మరియు ప్రేక్షకులు ఉన్నారు.