సోనియా గాంధీ మీటింగ్ : కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోయారు

మేడ్చల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆమె విమర్శించారు.

 Medchel Meeting Soniya Gandhi Fire On Kcr Government-TeluguStop.com

రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తమకు రాజకీయంగా ఎంతో నష్టం జరిగినా… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.నీళ్లు, నిధులు, నియామకాల అకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల జీవితాలను చూస్తుంటే భాదగా ఉందన్నారు.

టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలన అంతం కాబోతున్నదన్నారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.తెలంగాణ ఏర్పాటులో మీ పోరాటంతో పాటు సోనియా పాత్ర కూడా ఉందన్నారు.గత నాలుగున్నారేళ్లలో తనకు తోచిందే వేదంగా.

తన కుటుంబ లబ్ధి కోసమే పాలన సాగించారని రాహుల్ నిప్పులు చెరిగారు.టీఆర్‌ఎస్‌ పాలన అంతంకోసమే కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, టీజేఎస్ జట్టుకట్టాయని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube