ఆ ఒక్క పాట ఆమె జీవితాన్నే మార్చేసింది

సాధారణంగా ఫేమస్ అవ్వడానికి వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయసులోనైనా అవ్వచ్చు.ఎందుకంటే ఈ పాపులర్ అనే పదం వయసు ఆడ, మగ అన్న భేదాలు, తారతమ్యాలు లేకుండా ఎవరికి మంచి టాలెంట్ ఉంటే వారందరికీ వర్తిస్తుంది.

 Medaram Jathara Song Trending In Youtube-TeluguStop.com

అయితే తాజాగా రెండేళ్లకోసారి జరిగేటువంటి మేడారం జాతరను కీర్తిస్తూ పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.

అయితే తే ఈ పాటని గొట్టే కనకవ్వ జానపద గాయకురాలు పాడింది.

ఈమెకు చిన్నప్పటినుంచి  పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది.కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా అది సాధ్యపడేది కాదు.

అయినప్పటికీ తన పొలంలో పనులు చేసుకుంటూ తన పాటలతో అలరించేది.అయితే ఓ రోజున ఓ యూ ట్యూబ్ లో వీడియోలు చేసే వ్యక్తి ఆమె పాట విని ఆమెతో జానపద పాటని పాడించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు.

ఈ పాటకి మంచి స్పందనే వచ్చింది దాంతో కనకవ్వ తో మేడారం జాతరపై మంగ్లీ తో కలిసి పాడిన పాటను  యూట్యూబ్లో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వీడియోలు సరసన ట్రెండింగ్ లో నిలుస్తోంది.

Telugu Gotte Kanakavva, Medaram Jathara, Medaramjathara-Movie

ఈ విషయం తెలుసుకున్నటువంటి కనకవ్వ హర్షం వ్యక్తం చేస్తుంది.అంతేగాక తన పాటని ఇలా యావత్ దేశానికి వినిపించేలా చేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలిపింది.అంతేగాక మొన్న జరిగినటువంటి మేడారం జాతరకి తాను వెళ్ళినప్పుడు అందరూ తనని గుర్తు పట్టి ఫోటోలు దిగుతున్నారని అందుకు చాలా సంతోషంగా ఉందని అంటోంది కనకవ్వ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube