కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు పార్టీకి మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు.
గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్ కు కేటాయిస్తున్నట్లు పార్టీ తెలిపింది.
ఈ క్రమంలో మెదక్ టికెట్ ఆశించిన కంఠారెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన తనలాంటి వారికి గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రమను కాదని డబ్బు ఆధారంగానే టికెట్లు ఇస్తున్నారని విమర్శలు చేశారు.కేవలం డబ్బున్న వ్యక్తులకే పార్టీ టికెట్లను కేటాయిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారని సమాచారం.
ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పెద్దలు సైతం మౌనంగా ఉండటం తనను మరింత బాధకు గురి చేసిందని కంఠారెడ్డి తెలిపారు.