మెకానిక్ ద‌శ తిరిగింది.. లాట‌రీలో కోట్లు

ఎవ‌రి అదృష్టం ఎప్పుడు మ‌లుపు తిరుగుతుందో ఎవ‌ర‌మూ చెప్ప‌లేం.ఒక్కొక్క‌రి ఫేట్ ఒక్కో స‌మ‌యంలో మారిపోతుంది.

 Mechanic Scene Turned Quotes In The Lottery, Lucky Mechanic, Lottery , Gregory W-TeluguStop.com

ఇక‌పోతే ఈ మ‌ధ్య చాలామంది జీవితాలు లాట‌రీ టికెట్ల కార‌ణంగా భారీగా మారుతున్నాయి.రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కూడా అయిపోతున్నారు.

కాగా ఈ లాట‌రీల్లో డ‌బ్బులు ద‌క్కాలంటే నిజంగానే అదృష్టం ఉండాలేమో.ఎందుకంటే వేల మందిలో ఎవ‌రికో ఒక్క‌రికి మాత్ర‌మే ద‌క్కుతుందంటే మామూలు విష‌యం కాదు క‌దా.

ఇప్పుడు ఓ సాధార‌ణ మెకానిక్ జీవితం కూడా ఇలాగే మారిపోయింది.

అత‌ని అదృష్టం అత‌న్ని రాత్రికి రాత్రే వ్యక్తి కోటీశ్వరుడిని చేసింది.అప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ మెకానిక్ గా ఉన్న అత‌ను ఒక్కసారిగా రూ.1.5 కోట్లు సంపాదించేశౄడు.త‌న జీవితాంతం కష్టపడినా అన్ని డ‌బ్బులు వ‌చ్చేవో కాదు తెలీదు గానీ లాట‌రీతో మాత్రం జాక్‌పాట్ త‌గిలింద‌నే చెప్పాలి.

విష‌యం ఏంటంటే అమెరికా దేశంలోని నార్త్‌ కరోలినా ప్రాంతంలో ఓ మెకానిక్ నివ‌సిస్తున్నాడు.ఇక ఎప్ప‌టి లాగే గ‌త నెల 29వ తేదీన గ్రెగరీ వారెన్ ప‌నికి వెళ్తుండ‌గా అదే చోట క్యాష్‌ 5 లాటరీలు అక్క‌డి నిర్వాహ‌కులు అమ్ముతుండ‌గా అత‌ను కూడా ఓ టికెట్ కొనుక్కున్నాడు.

అయితే త‌న‌కు వ‌స్తుందో రాదో అన్న అప‌న‌మ్మ‌కంతో దాన్ని అస‌లు అత‌గాడు ప‌ట్టించుకోలేదు.అక్టోబరు 4వ తేదీ దాకా అస‌లు టికెట్ దిక్కు క‌నీసం చూడ‌ను కూడా చూడ‌లేదు.

అయితే నిర్వాహ‌కులు ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో అత‌ను జాక్‌పాట్‌ గెలుచుకున్నాడు.ఇందులో దాదాపు 2 లక్షల డాలర్లను సొంతం చేసుకున్నాడు.అటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.1.5 కోట్లు అన్న‌మాట‌.దీంతో అత‌ని జీవితం ఒక్క‌సారిగా ట‌ర్న్ అయిపోయింది.

ఇన్ని రోజులు చాలా క‌ష్టాలు ప‌డ్డాన‌ని ఈ డ‌బ్బుల‌తో త‌న కుటుంబ అవ‌స‌రాలు మొత్తం తీర్చుకుంటాన‌ని వెల్ల‌డించాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube