మాంసం తింటున్నారా ? ఇలా మాత్రం తినకండి

ముక్క లేనిదే ముద్ద దిగదు చాలామందికి.మాంసంతో చేసిన నా వంట కాలను లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.

 Non Veg Food, Chicken,spinal Fluid Brain, Telugu Health, Health Tips-TeluguStop.com

కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే తింటే మరికొంతమంది ప్రతిరోజు ముక్కతో ముద్ద నోట్లో పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో అంతా నాన్ వెజ్ వంటకాలకు బాగా అలవాటు పడిపోయారు.

అయితే పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం తింటే పెద్దగా ఇబ్బంది ఏమి లేదు కానీ ఉడికి ఉడకని పచ్చి మాంసం తింటే మాత్రం శరీరంలోకి బద్దె పురుగులు చేరే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ బద్దెపురుగు మెదడులోకి చేరితే వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇక అప్పుడు ఎంత మంది డాక్టర్లకు చూపించుకున్నా, ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటుందని ముందు జాగ్రత్తలు చెబుతున్నారు.ఆ ఎఫెక్ట్ వెన్నుపూస నుంచి స్పైనల్ ప్లూయిడ్ బ్రెయిన్ వరకు చేరి మరింత కుంగదీసే ప్రమాదం ఉందంట.

ఈ మధ్యకాలంలో చైనా, అమెరికా దేశాల్లో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదు అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక గర్భిణీలు మాంసం తినే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి సరిగా ఉడకని మాంసం తినడం వల్ల టోక్సోప్లాస్మోసిస్‌ అనే ఇన్ఫెక్షన్‌ వచ్చి బేబీ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది.

పిల్లలకు అంధత్వం కలిగే అవకాశం ఉందట.అలాగే ఉడికి, ఉడకని చికెన్ తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతునాన్రు.

కాబట్టి మాంసం తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే మన శరీరం మన మాట వినే పరిస్థితి ఉండదు.కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube