అసలు ‘సలార్’ అంటే ఏమిటీ.. ప్రభాస్ ఈ టైటిల్‌నే ఎందుకు ఎంచుకున్నాడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

 Meaning Of Prabhas Prashant Neel Salaar Movie Title, Prabhas, Prashant Neel, Sal-TeluguStop.com

కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ 21వ చిత్రం రానున్నట్లు అనౌన్స్ చేశాడు.

కాగా ఈ సినిమా పట్టాలెక్కకముందే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.

ఇక తాజాగా ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాన్ని కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు ‘సలార్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.ఈ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో ప్రేక్షకులు ట్రెండ్ చేస్తూ దుమ్ములేపుతున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో, ఇంతకీ ఆ టైటిల్ వెనుక అర్ధం ఏమిటా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.

సలార్ అనే పదం ఉర్దూ భాషకు చెందినదిగా తెలుస్తోంది.

ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపువాడు అనేది ఈ పదానికి అర్ధం.మొత్తంగా చూస్తే బలమైన నాయకుడు అనేది ఈ పదానికి పక్కా అర్థం అని పలువురు అంటున్నారు.

అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ బలమైన నాయకుడి పాత్రలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ పోస్టర్‌తోనే చెప్పేసింది.ఇక వైలెంట్ మనుష్యులు అత్యంత వైలెంట్ మనిషిగా ‘సలార్’ను పిలుస్తారని చిత్ర యూనిట్ అంటోంది.

మరి అంత వైలెంట్‌గా ప్రభాస్ ఎలా కనిపిస్తాడో తెలియాలంటే మాత్రం సలార్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియన్ మూవీని తెరకెక్కించిన నిర్మాతలు ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube