గోత్రం అంటే ఏమిటి? ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోవచ్చా?     2018-12-24   05:10:42  IST  Raghu

హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. అలాగే ప్రతి కులానికి వారికీ సంబంధించి గోత్రం ఉంటుంది. అసలు గోత్రం అనేది ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. పూర్వ కాలంలో విద్యను నేర్పించటానికి కొన్ని కుటుంబాలకు ఒక గురువు ఉండేవారు. ఆ కుటుంబాలకు ఆ గురువు పేరు గోత్రంగా ఉండేది.

Meaning Of Gotram And Importance It In Marriage-Hindu Families Marriage

Meaning Of Gotram And Importance Of It In Marriage

విద్యను అభ్యసించని వారు వారి పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకొనేవారు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి గోత్రం ఏర్పడింది. ఒకే గోత్రం కలిగిన వారు వివాహం చేసుకోవటానికి హిందూ శాస్త్రం సమ్మతించడు. ఎందుకంటే ఒకే గోత్రం కలిగిన వారు అన్నా చెల్లెల్లు అవుతారని శాస్త్రం చెప్పుతుంది. హిందూ శాస్త్ర ప్రకారం రక్త సంబంధీకులు వివాహం చేసుకోకూడని… ఒకే గోత్రం ఉన్న వారు అన్న,చెల్లి లేదా అక్క,తమ్ముడు అవుతారని అర్ధం. పరిచయం లేకున్నా ఒకే గోత్రం ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ బీరకాయ పీచు రక్త సంబంధం కలిగి ఉంటుంది.

Meaning Of Gotram And Importance It In Marriage-Hindu Families Marriage

అందువల్ల గోత్రం కలిసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అయిన వారికీ రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందువల్ల గోత్రాలు కలిసినప్పుడు వివాహం చేయరాదని హిందూ శాస్త్రం మరియు మన పెద్దలు చెప్పుతారు.