లాహే..లాహే పాటలో ఇంత అర్థం ఉందా.. గట్టిగా వింటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు..!!

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని “లాహే లాహే” అనే పాట ఇటీవలే విడుదలైంది.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మొదటి పాటగా ఈ పాట రాగ ఈ పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగా ఈ పాట లో ఉన్న అర్థాన్ని విని కొంతమంది చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

 Acharya's Laahe Laahe Song Meaning In Telugu, Acharya Movie, Manisharma Music, L-TeluguStop.com

రామ జోగయ్య రచించిన ఈ పాట కి మణిశర్మ సంగీతం అందించగా హారిక నారాయణ్, సాహితి చాగంటి లు ఆలపించిన ఈ పాట ఇంకా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
ఈ పాట ని ఒకటి రెండు సార్లు వింటే ఈ పాట శివుడు పార్వతుల మధ్య సాగే సభాషణగా మనకు అర్థమవుతుంది.

ఈ పాట యొక్క అర్థాలు ఇప్పుడు పల్లవి, చరణాలుగా చూద్దాం.
లాహే లాహే లాహే
లాహే లాహే లాహే
కొండల రాజు బంగారు కొండా
కొండా జాతికి అండా దందా
మద్దె రాతిరి లేచి మంగళ గౌరీ
మల్లెలు కోసిందె.
వాటినిమాలలు కడతా
మంచు కొండల స్వామిని తలసిందే.
లాహే లాహే లాహే
లాహే లాహే లాహే
ఒక్క మధ్య రాత్రి మల్లెలు కోస్తున్న పార్వతి దేవి కి ప్రణయావేశం వచ్చి శివుడిని ఆ మంచు కొండలవాడిని తలిచిందట.
మెళ్ళో మెలికల నాగుల దండ
వేలుపు వేడికి ఎగిరిపడంగా.
ఒంటి ఇబూది రాలి పడంగా.
సాంబుడు కదిలిండే.
అమ్మ పిలుపుకు సామీ అత్తరు సెగలై
విల విల నలిగిండే.
లాహే లాహే లాహే
లాహే లాహే లాహే

Telugu Acharya, Acharyaslaahe, Chiranjeevi, Laahe Laahe-Movie

పార్వతి దేవి తలచింది తడవుగా శివుడి వంట్లో వలపుల వేడి అగ్నిపర్వతాలు బద్దలై ఎగిసి పడిందట.ఆ వలపుల వేడికి మెళ్ళో మెలికల నాగుల దండ ఎగిరిపడిందట.వంటి మీది విభూది రాలిపడిందట.
కొర కొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కళ్ళు
ఎర్రటి కోపాలెగసిన కుంకుమ బొట్టు ఎన్నెల కాసిందే
పెనీవిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే
ఉబలాటంగా ముందుకురికి
అయ్యావతారం చూసిన కొలికి
ఏందా శంకం సూలం
బైరాగేశం ఏందని సణిగిందే
ఇంపుగా ఈపూటైనా రాలేవా అని సనువుగా కసిరిందె
లాహే లాహే లాహే
లాహే లాహే లాహే

పార్వతి దేవి కళ్ళు కొరకొరా మండుతుండగా, ఆమె జుట్టు ఇరబోసి ఉండగా , నుదుటున బొట్టు ఎర్రటి కోపాలెగిసిన ఈనెల లాగా ఉన్నాయట.

అప్పుడే శివుడి రాకను గమనించి ఆమె సిగ్గుపడింది.అయితే ఆ సంతోషంలో శివుడిని చేసిన ఆమె అవతారం చూసి ఈపూటైనా ఇంపుగా రాలేవా అని కసిరింది.

లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసె సొంతింట్లోనా
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డా నామాలు
ఆలూ మగలా నడుమ అడ్డం రావులే ఎంతటి నీమాలు
ఆ వేషధారణలో వచ్చిన స్వామిని చూసి అలిగిన పార్వతి దేవి ని అలక దించే క్రమంలో అమ్మోరి గడ్డం పట్టుకుని అడ్డనామాలవాడు బ్రతిమాలాడట.ఆలు మగలా మధ్య ఎలాంటి నియమాలుండవట.
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకు ముదిరిన విరసం
సర్దుకుపోయి సరసం కుదిరే వేళకు మూడో జామాయె
ఒద్దిక పెరిగే నాలుగో జాముకు గుళ్లో గంటలు మొదలాయె
లాహే లాహే లాహే
లాహే లాహే లాహే…
ఒకటో జామున కలిగిన విరహం రెండోజామున విరసం గా మారింది.మూడో జామున సరసం కుదిరే టైం కు నాలుగో జామాయె.

ఇంకేముంది గుళ్లో గంటలు మోగాయి.అంటూ ఎంతో చమత్కారంతో రాశాడు శాస్త్రి గారు ఈ పాటను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube