బ్రిటన్ కొత్త ట్రావెల్ రూల్స్.. ‘‘టీకా’’ విషయంలో దుమారం, రంగంలోకి విదేశాంగ శాఖ

కోవిడ్ కారణంగా గడిచిన ఏడాదిన్నరగా అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపై బ్రిటన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఇందులో భారత్ కూడా వుంది.

 Meashankar Raises Issue During His Meeting With Uk Counterpart Elizabeth Truss ,-TeluguStop.com

మనదేశంలో సెకండ్ వేవ్‌ ఉవ్వెత్తున ఎగిసిపడటంతో యూకే సర్కార్ భారతీయులపై యూకే సర్కార్ బ్యాన్ కొనసాగించింది.అయితే ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున ఇటీవల రెడ్‌లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది.

ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో యూకే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ పరిస్ధితుల్లో యూకే ప్రభుత్వం భారతీయులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాలని తేల్చిచెప్పింది.

దీంతో విషయం భారత ప్రభుత్వం వరకు వెళ్లింది.ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది.

దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా రంగంలోకి దిగారు.పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరారు.అలాగే యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కేంద్రమంత్రి.

క్వారంటైన్‌ నిబంధనలు, కొత్త మార్గదర్శకాల విషయాన్ని కూడా ప్రస్తావించారు.రెండు దేశాల పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్‌ తెలిపారు.

Telugu Africa, Britain, Jairam Ramesh, India, Jordan, Meajaishankar, Externalaff

అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధలను బ్రిటన్‌ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది.దీని ప్రకారం.కొత్త మార్గదర్శకాల ప్రకారం.ఒక వ్యక్తికి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, ఇండియా, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యా వంటి దేశాలలో టీకాలు వేసినప్పటికీ వారిని టీకాలు పొందని వారిగానే చూస్తామని యూకే ప్రభుత్వం తెలిపింది.

తమ దేశంలోకి వచ్చే ఈ దేశాల ప్రజలు ఖచ్చితంగా పది రోజుల పాటు నిర్బంధ క్వారంటైన్‌లో వుండాలని స్పష్టం చేసింది.

దీంతో యూకే ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోవిషీల్డ్ టీకాను ఆ దేశ ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా వుందన్నారు.వాస్తవానికి ఈ టీకా యూకేకు చెందినదేనని.

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన ఫార్ములా ఆధారంగానే పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ టీకాలు ఉత్పత్తి చేసి బ్రిటన్‌కు సైతం ఎగుమతి చేసిందని గుర్తుచేశారు.ఇది ముమ్మాటికీ జాత్యహంకారమేనంటూ జైరాం రమేశ్ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube