ప్రవాస భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేకమైన యాప్..!!!

భారత్ నుంచి ఎంతో మంది వివిధ దేశాలకు వివిధ కారణాల ద్వారా వలసలు వెళ్ళారు.అలా వెళ్ళిన వారు అక్కడి వివిధ రంగాలలో స్థిరపడి ఉన్నత జీవితాలను గడుపుతున్నారు.

 Mea Launches Golbal Pravasi Rishta Portal And App, Ministry Of External Affairs-TeluguStop.com

వారి వారి ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకుంటూనే భారత్ లోని తమ తమ ప్రాంతాలకు వివిధ రకాలుగా సహాయసహకారాలు అందిస్తూ భారత్ పై తమకు ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటి చెప్తూనే ఉన్నారు.ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 3.12 కోట్ల మంది భారతీయులు విదేశాలలో ఉన్నట్టుగా తేలింది.ఇదిలాఉంటే

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3.12కోట్ల మంది భారతీయులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అలాగే వారితో భారత ప్రభుత్వం కనెక్ట్ అయ్యేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గ్లోబల్ ప్రవాసి రిష్ట పోర్టల్

https://pravasirishta.gov.in/home ను ప్రారంభించింది.

విదేశాలలో ఉన్న భారతీయులు అందరితో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ను రూపొందించినట్టుగా తెలుస్తోంది.ఈ మేరకు విదేశీ వ వ్యవహారాల మంత్రి వి.

మురళీధరన్ మాట్లాడుతూ పోర్టల్ యాప్ ల ద్వారా వివిధ దేశాలలో ఉన్న భారతీయులు తమ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపవచ్చని తెలిపారు.

Telugu Indian Embassy, Passport, Visa, Muralitharan-Telugu NRI

ఈ పోర్టల్ తో ఎన్నారైలు కనెక్ట్ అవ్వడం ద్వారా భారత్ నుంచి ఎన్నారైలకు ఉపయోగపడే కీలక సమాచారాలను పంచుకోవచ్చని, అలాగే ఎన్నారైల కు ఉపయోగ పడే ప్రభుత్వ పధకాలు, ఎన్నారైలు భారత్ లో ఎదుర్కునే ఎలాంటి సమస్యలను అయినా ఇందులో తెలుపవచ్చని తెలిపింది కేంద్రం.అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు వీలుగా ఎన్నారైలకు విలువైన సూచనలను చేయడానికి కూడా ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. వీసా, పాస్ పోర్ట్ వంటి సేవల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని మురళీధరన్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube