తెలుగులో అనర్గళంగా మాట్లాడిన ఇథియోపియా మినిస్టర్ .. షాకైన విదేశాంగ మంత్రి జైశంకర్

దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు.‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అన్నారు వెనీషియన్‌ యాత్రికుడు నికోలో డి కాంటే.ఇప్పటికీ ఇవే మాటలను ఉటంకిస్తూ సంబరపడిపోతుంటారు మన భాషాభిమానులు.1000 ఏళ్లకు పైగా ఘన చరిత్ర వున్న తెలుగు భాష ఇప్పుడు మృత భాషగా మారే ప్రమాదం పొంచి వుంది.ఏ యేటికాయేడు తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.ఇంటర్‌నెట్, స్మార్ట్‌ ఫోన్‌ రంగ ప్రవేశంతో గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

 Mea Jai Shankar Tweet On Ethiopia Minister Ergogie Tesfaye Telugu Speaking Skills , Italian Of The East, Venetian Traveler Niccol De Conte, Mea Jai Shankar, Ethiopian Minister Of Social Affairs Ergozi Tesfai-TeluguStop.com

టెక్నాలజీ మన జీవితాల్లోకి ఇంతగా వచ్చేయడంతో అంతా ఇంగ్లీష్ మయమే.

పరీక్షలో పాసయ్యేంత నేర్చుకుంటే చాలు అనుకునే ఓ సబ్జెక్ట్‌గానే మిగిలిపోయింది తెలుగు.

 MEA Jai Shankar Tweet On Ethiopia Minister Ergogie Tesfaye Telugu Speaking Skills , Italian Of The East, Venetian Traveler Niccol De Conte, MEA Jai Shankar, Ethiopian Minister Of Social Affairs Ergozi Tesfai-తెలుగులో అనర్గళంగా మాట్లాడిన ఇథియోపియా మినిస్టర్ .. షాకైన విదేశాంగ మంత్రి జైశంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు తల్లిభాషలో కూడా ఫెయిల్ అయ్యే దౌర్భాగ్యం మన పిల్లలకు పట్టుకుందంటే.మన విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు ఏ స్థాయిలో తెలుగు పట్ల శ్రద్ధ వహిస్తున్నారో అర్ధమవుతోంది.

ఎక్కడో ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, మన భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సైతం సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించారు సర్ సీపీ బ్రౌన్.ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు, తెలుగు ప్రజలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?.

ఇకపోతే.తెలుగు భాషపై అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా, అనర్గళంగా మాట్లాడి ఏకంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు షాకిచ్చారు ఇథియోపియా సామాజిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఎర్గోజీ టెస్ఫాయీ.ఆమెకు ఆయా దేశాల ఆచార వ్య‌వ‌హారాలు, సంస్కృతి సంప్ర‌దాయాలపై మ‌క్కువ ఎక్కువ.దీనిలో భాగంగా భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ కల్చ‌ర‌ల్ రిలేష‌న్స్ (ఐసీసీఆర్‌) అందించే స్కాల‌ర్‌షిప్‌ను సాధించి భార‌త్‌కు వ‌చ్చి మ‌రీ పీహెచ్‌డీ చేశారు.

అంతేకాదు.ఎర్గోజీ తెలుగును చ‌క్క‌గా.అన‌ర్గ‌ళంగా మాట్లాడుతారు.ఇథియోపియా రాజ‌ధాని అడ్డిస్ అబాబాలో నూత‌నంగా నిర్మించిన భార‌త రాయ‌బార కార్యాల‌య భ‌వ‌న స‌ముదాయం ప్రారంభోత్సవానికి జైశంక‌ర్ బుధ‌వారం అక్క‌డికి వెళ్లారు.ఈ సంద‌ర్భంగా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వచ్చారు ఎర్గోజీ టెస్ఫాయీ.ఈ క్రమంలో జైశంక‌ర్‌తో మాట క‌లిపిన ఆమె తెలుగులో మాట్లాడార‌ట‌.

దీనికి షాకైన జైశంకర్ అభినందనలు తెలియజేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube