కెనడా నుంచి 700 మంది భారతీయ విద్యార్ధులు బహిష్కరణ.. రంగంలోకి విదేశాంగ శాఖ

పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ( Vikramjit singh sahney ) శనివారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌( Jaishankar )ను కలిశారు.ఈ సందర్భంగా కెనడా నుంచి 700 మంది భారతీయ విద్యార్ధులను బహిష్కరించిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా జైశంకర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.

 Mea Has Taken Up Issue On Deportation Of 700 Indian Students From Canada, Indian-TeluguStop.com

అనంతరం సాహ్నీ మాట్లాడుతూ.ఈ విషయంలో అండగా వుంటానని విదేశాంగ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

దాదాపు 100 మంది భారతీయ విద్యార్ధులు టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించినట్లు ఎంఈఏ అధికారులు తనకు సమాచారం అందజేశారని విక్రమ్‌జిత్ చెప్పారు.ఢిల్లీలోని కెనడా హైకమీషన్‌తో( Canada ) పాటు ఒట్టావాలోని భారత హైకమీషన్‌తో సమన్వయం చేసుకుంటూ సమస్యను పరిష్కరిస్తామని జైశంకర్ హామీ ఇచ్చినట్లు సాహ్నీ తెలిపారు.

కెనడాకు వెళ్లేందుకు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, చదువులు పూర్తి చేసి.అనుభవం సంపాదించిన వారిని బహిష్కరించకుండా చూడాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్ధించారు.

Telugu Canada, Jaishankar, Punjab, Vikramjitsingh, Punjabi-Telugu NRI

వరల్డ్ పంజాబీ ఆర్గనైజేషన్ సైతం ఈ విషయంలో రెండు ప్రభుత్వాలతో పాటు విద్యార్ధులకు ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుందని విక్రమ్‌జిత్ స్పష్టం చేశారు.వివిధ కళాశాలల నుంచి నకిలీ అడ్మిషన్ లెటర్స్‌తో విద్యార్ధులు కెనడాకు వెళ్లారని విదేశాంగ శాఖలోని ఉత్తర అమెరికా విభాగం అధికారులకు విక్రమ్ జిత్ తెలిపారు.ఈ కారణంగా వారి అడ్మిషన్ రద్దు చేయగా, ఇతర కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుని చదువులను పూర్తి చేశారని ఆయన వెల్లడించారు.అయితే పేరుమోసిన ఏజెంట్లు అందించిన నకిలీ అడ్మిషన్ లెటర్స్‌తో విద్యార్ధులు కెనడా వరకు ఎలా చేరుకున్నారనేది ఆసక్తిని కలిగిస్తోందని విక్రమ్ జిత్ అన్నారు.

Telugu Canada, Jaishankar, Punjab, Vikramjitsingh, Punjabi-Telugu NRI

కాగా.చాలా మంది పంజాబ్ విద్యార్ధులు( Punjab students ) తమ చదువును పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ కింద కెనడాలో ఏడాది పాటు ఉద్యోగాలు చేశారని సాహ్నీ తెలిపారు.ఈ క్రమంలో వారు పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసినప్పుడు .డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ అసలు విషయాన్ని పసిగట్టంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube