'మీటూ' అనరేంటి ..? టాలీవుడ్ కి ఏమైంది ..?  

  • కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్తా ఇప్పుడు పెద్దదయిపోయింది. మీటూ పేరుతో బాలీవుడ్ లో ఈ అంశంపై పెద్ద ఉద్యమం జరుగుతోంది. తమిళ సింగర్ చిన్మయి కూడా ఇందులోకి వచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక బాలీవుడ్ లో కథానాయకులంతా మీటూకి మద్దతు తెలిపారు. అక్షయ్ కుమార్ షూటింగులను క్యాన్సిల్ చేసి సంచనల నిర్ణయం తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు కూడా మీటూపై స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ట్వీట్లపై కూడా కౌంటర్లు కూడా పడ్డాయి. అమితాబ్ స్పందన కంటే, ఆ స్పందనపై వచ్చిన కౌంటర్లే బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది గా మారాయి.

  • Me Too Moment Start Ballywood But Taliwood Heros No Responce-

    Me Too Moment Start Ballywood But Taliwood Heros No Responce

  • ఈ ఉద్యమంపై ఇప్పటి వరకూ టాలీవుడ్ హీరోలెవరూ పెదవి విప్పలేదు. దానికీ కారణం ఉంది. ఏరి కోరి ఎందుకు రొంపిలోకి దిగడం అని. ఎవరు స్పందించినా కౌంటర్లు వేయడానికి శ్రీరెడ్డి లాంటి వాళ్లు రెడీగా ఉంటారు. అమితాబ్‌కి ఎదురైన పరిస్థితే మన హీరోలకూ ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. సమంత, రకుల్‌, కాజల్‌ వీళ్లంతా దక్షిణాది కథానాయికలే. వీరంతా ఆ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ వారితో నటించిన తెలుగు హీరోలు మాత్రం నోరు మెదపడంలేదు.