నేను- నా భ‌ర్త స‌మాధి నా జ్ఞాప‌కాలు... రియ‌ల్ స్టోరి     2019-01-16   11:43:44  IST  Raghu

ఒక ప‌క్షి జీవించ‌డానికి దానికి కూడా ఒక ప్ర‌దేశం ఉంది. కానీ నాకు మాత్రం లేదు. గ‌త 10 రోజుల నుంచి నేను వీధుల్లోనే ఉంటున్నా. ప్ర‌తి రోజు రాత్రి ఎవ‌రో ఒకరి ఇంటికి వెళ్లి.. వారి ఇంటి ముందు ప‌డుకుంటానికి అనుమ‌తి తీసుకుంటున్నా. అది నాకు న‌చ్చ‌డం లేదు. కానీ అలా చేయ‌క త‌ప్ప‌డం లేదు. నాకు వేరే ఆప్ష‌న్ లేదు. నాకు ఉండేందుకు ఇల్లు లేదు. బంధువులు లేరు. తినేందుకు ఆహారం లేదు. ధ‌రించ‌డానికి ఒంటి మీద ఉన్న దుస్తులు తప్ప వేరేవి లేవు.

10 రోజుల కింద‌ట పద్మా న‌దిలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల కార‌ణంగా నా ఒక్కగానొక్క ఇల్లు అందులో కొట్టుకుపోయింది. ఆ న‌ది 85 ఏళ్ల వృద్ధురాలిన‌ని కూడా చూడ‌లేదు. నా ప‌ట్ల న‌ది ఏమాత్రం జాలి చూపించ‌లేదు. నేను ఈ ప్రాంతం విడిచిపెట్టి వేరొక ద‌గ్గ‌రికి వెళ్ల‌లేను. ఎందుకంటే నా భ‌ర్త స‌మాధి ఇక్క‌డే ఉంది. ఇక్క‌డ నివ‌సించిన వేల మంది లాగే వ‌ర‌ద‌ల్లో నేనూ నా స‌ర్వ‌స్వాన్ని కోల్పోయాను. ఉగ్ర‌రూపం దాల్చిన న‌ది ఒక సెక‌ను కూడా ఆలోచించ‌కుండా మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయింది. అయినా నేను జీవిస్తాన‌న్న న‌మ్మ‌కం నాకుంది.

Me And My Memories Of Husband's Grave Real Story-Floods Padma River Husband's Story

Me And My Memories Of My Husband's Grave Real Story

ఆ న‌ది నా భ‌ర్త స‌మాధిని కూడా పూర్తిగా త‌న‌లో క‌లిపేసుకుంది. నేను ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి జీవించి ఉన్నానంటే నా భ‌ర్త స‌మాధే కార‌ణం. కానీ ఇప్పుడది లేదు. దాంతోపాటు నా 80 ఏళ్ల జ్ఞాప‌కాలు కూడా న‌దిలో క‌లిసిపోయాయి. చాలా మంది ఇక్క‌డి నుంచి వెళ్లిపోతున్నారు. కానీ నేను ఇక్క‌డి నుంచి వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నా. 10 రోజుల నుంచి నేను ప్ర‌తి రోజూ న‌దిని ప‌రిశీలిస్తున్నా. నా భ‌ర్త స‌మాధి ఎక్క‌డైనా క‌నిపిస్తుందేమోన‌ని. నా భ‌ర్త చ‌నిపోయాక ఆయ‌న స‌మాధే నన్ను ఇంత‌కాలం ర‌క్షిస్తూ వ‌చ్చింద‌ని భావించా. కానీ ఇప్పుడా ర‌క్ష‌ణ నాకు క‌రువైంది. ఆ న‌ది నా జ్ఞాప‌కాల‌ను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు నేను బ‌తికున్న శ‌వంతో స‌మానం. ఆ న‌ది నా ఇంటినే కాదు, నా జీవితాన్ని కూడా తీసుకెళ్లిపోయింద‌ని ఇప్పుడ‌నిపిస్తోంది.