సహోద్యోగితో లైంగిక సంబంధం: మెక్‌డొనాల్డ్స్ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బ్రూక్‌పై వేటు

సహోద్యోగితో లైంగిక సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలపై ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ సీఈవో స్టీవ్ ఈస్టర్భ్రూక్‌ను యాజమాన్యం పదవి నుంచి తొలగించింది.ఆయన స్థానంలో యూఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ కెంప్జిన్క్సీని నియమిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

 Mcdonaldsteve Easterbrook Isoutfor Consensualrelationship-TeluguStop.com

52 ఏళ్ల ఈస్టర్బ్రూక్ మెక్‌డొనాల్డ్స్‌లో ప్రవేశించకముందు 1993లో లండన్‌లో ఫైనాన్సియల్ మేనేజర్‌గా పనిచేశారు.అనంతరం 2011లో పిజ్జా ఎక్స‌ప్రెస్ నుంచి బయటకువచ్చి.ఏసియన్ ఫుడ్ చైన్ సంస్థ వాగమామాలో చేరారు.2013లో మెక్‌డొనాల్డ్స్‌లో చేరి యూకేతో పాటు ఉత్తర ఐరోపాకు అధిపతిగా వ్యవహరించారు.స్టీవ్ పనితీరును గమనించిన మెక్‌‌డొనాల్డ్స్ యాజమాన్యం 2015లో ఆయనకు చీఫ్ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించింది.వచ్చి రావడంతోనే సంస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు స్టీవ్.

Telugu Telugu Ups-

మెనూలు మార్చడంతో పాటు రెస్టారెంట్లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఔట్ లెట్లను తెరిచి వినియోగదారులను ఆకర్షించారు.ఈస్టర్‌బ్రూక్ హయాంలో అమెరికాలో మెక్‌డొనాల్డ్స్ వాటాల విలువ రెట్టింపు అయ్యింది.ఆయన నేతృత్వంలో వేగవంతమైన డెలీవరి, మొబైల్ పేమెంట్స్‌ను కూడా మెక్‌డొనాల్డ్స్ అందిపుచ్చుకుని మిగిలిన సంస్థలకు గట్టిపోటీనిచ్చింది.

సంస్థ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన ఈస్టర్‌బ్రూక్ తన కిందిస్థాయి ఉద్యోగినితో సంబంధం పెట్టుకున్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది.గత శుక్రవారం ఈ ఆరోపణలపై సమీక్ష జరిపిన కంపెనీ బోర్డు… వీటిని ధ్రువీకరించింది.

సంస్థ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినందుకు గాను విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube